Siddipet: గుండె నిండా తండ్రి జ్ఞాపకం.. ఇంటి దగ్గర శవం.. పరీక్ష హాల్లో పాప!
Siddipet: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో విషాదం. కిడ్నీ వ్యాధితో తండ్రి చంద శ్రీనివాస్ మరణించినా, పదో తరగతి పరీక్షకు హాజరైన కుమార్తె ఐశ్వర్య.
Siddipet: గుండె నిండా తండ్రి జ్ఞాపకం.. ఇంటి దగ్గర శవం.. పరీక్ష హాల్లో పాప!
సిద్దిపేట జిల్లా: దౌల్తాబాద్ మండలంపరిధిలోని గోడుగు పల్లి గ్రామంలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చంద శ్రీనివాస్(35) గత కొద్దిరోజులుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు.తనకు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు.కుటుంబంలో ఆదరణగా నిలిచిన శ్రీనివాస్ మృతి ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. తండ్రి మృతి వార్త విన్న కూతురు ఐశ్వర్య(15) ఒక్కసారిగా షాక్కు గురై కన్నీరు మున్నీరైంది.అయినప్పటికీ, తన భవిష్యత్తు కోసం తండ్రి కలలు నెరవేర్చాలనే సంకల్పంతో హృదయం నిండా బాధతోనే పదో తరగతి పరీక్షకు హాజరైంది. తండ్రి మృతదేహం ఇంట్లోనే ఉండగా పరీక్షకు వెళ్లిన ఆ బాలిక ధైర్యం అందరినీ కదిలించింది. గ్రామస్థులు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ, చిన్న వయస్సులోనే కుటుంబ బాధ్యతలు మోసే పరిస్థితి రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రిని కోల్పోయిన బాధ ఒక వైపు, చదువుపై ఉన్న నిబద్దత మరోవైపు ఈ రెండింటి మధ్య పోరాడుతున్న ఆ బాలిక కథ ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తుంది.