Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో సిద్దిపేట మహిళా నక్సలైట్ మృతి!
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సిద్దిపేట జిల్లాకు చెందిన మావోయిస్ట్ ఏరియా కమాండర్ రంగబోయిన భాగ్య అలియాస్ రూపి మృతి చెందారు.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో సిద్దిపేట మహిళా నక్సలైట్ మృతి!
Chhattisgarh: ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మరణించిన ఏరియా కమాండర్ రూపి అలియాస్ భాగ్యది స్వగ్రామం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామం.
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని లోని కాంకేర్ జిల్లాలో భద్రతా దళాలు జరిపిన ఎన్కౌంటర్లో నక్సల్ ఏరియా కమాండర్ ‘రూపి' అలియాస్ రంగబోయిన భాగ్య మృతిచెందారు. నక్సల్ ప్రభావిత ప్రాంతమైన కాంకేర్ జిల్లాలో భద్రతా దళాలు మరోసారి భారీ కూబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ నక్సల్ ఏరియా కమాండర్ 'రూపి' (Roopi) అలియాస్ రంగబోయిన భాగ్య మృతి చెందారు. ప్రభుత్వం ఆమెపై గతంలోనే రూ. 25 లక్షల రివార్డు ప్రకటించింది. చోటే బెటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పార్థాపూర్ ఏరియా కమాండర్ రూపి అక్కడికక్కడే మరణించారు.