KumbhMela Girl Monalisa : సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా మిస్సింగ్.. భర్త డ్రామానా? అసలేం జరిగింది?

KumbhMela Girl Monalisa : కుంభమేళాలో పూసలమ్మే అమ్మాయిగా పరిచయమై, ఓవర్ నైట్ సోషల్ మీడియా స్టార్‌గా మారిన మోనాలిసా జీవితం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. సినిమాల్లో అవకాశాలు, ప్రేమ పెళ్లి, ఆపై లవ్ జిహాద్ ఆరోపణలు.. ఇలా ఎన్నో మలుపులు తిరిగిన ఆమె కథ ఇప్పుడు అదృశ్యం అనే మిస్టరీ దగ్గర ఆగిపోయింది.

Update: 2026-04-13 03:50 GMT

Social Media Star Monalisa

KumbhMela Girl Monalisa : కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ కెమెరా కంటికి చిక్కిన మోనాలిసా, తన అందంతో సోషల్ మీడియాను ఊపేసింది. ఆ దెబ్బతో ఆమెకు బాలీవుడ్ నుంచి వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఆమె కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఈ పెళ్లి మొదటి నుంచీ వివాదాస్పదమైంది. హిందీ దర్శకుడు సనోజ్ మిశ్రాతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా దీనిని లవ్ జిహాద్ అని ఆరోపించారు. అక్కడితో ఆగకుండా, పెళ్లి సమయానికి ఆమె వయసు కేవలం 16 ఏళ్లేనని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) నిర్ధారించడంతో, ఫర్మాన్‌పై మధ్యప్రదేశ్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

తాజాగా ఫర్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేస్తూ.. మోనాలిసా కనిపించడం లేదని పేర్కొనడం సంచలనం రేపింది. రాజస్థాన్‌లోని అజ్మీర్, పుష్కర్ పర్యటనకు వెళ్లినప్పుడు ఆమె పారిపోయిందని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. అజ్మీర్ అంతా వెతికాను, ఇప్పుడు జోధ్‌పూర్ వెళ్తున్నాను అంటూ అతను చెబుతున్న మాటలు పోలీసులకు అనుమానం కలిగిస్తున్నాయి. తనపై ఉన్న పోక్సో కేసు నుంచి తప్పించుకోవడానికి ఫర్మాన్ ఆడుతున్న నాటకమే ఇదని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

మరోవైపు మోనాలిసా తల్లిదండ్రులు ఫర్మాన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమ కుమార్తెను అతను ఎక్కడో దాచేశాడని లేదా ఏదైనా హాని తలపెట్టి ఉంటాడని వారు భయపడుతున్నారు. గత 20 రోజులుగా తమ బిడ్డతో మాట్లాడకుండా ఫర్మాన్ అడ్డుకుంటున్నాడని, ఇప్పుడు కేసుల భయంతో పారిపోయిందని అబద్ధాలు చెబుతున్నాడని వారు వాదిస్తున్నారు. మోనాలిసా వయసు విషయంలో తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి మోసపూరితంగా పెళ్లి చేసుకున్నాడనే ఆరోపణలు ఇప్పటికే ఫర్మాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. ఒక మైనర్ బాలిక అదృశ్యం కావడం వెనుక ఏదైనా హ్యూమన్ ట్రాఫికింగ్ కోణం ఉందా లేదా కేవలం వ్యక్తిగత కారణాలా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఫర్మాన్ ఫోన్ రికార్డులను, వారి పర్యటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిన అమ్మాయి జీవితం ఇలా కోర్టులు, పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగడం ఆమె అభిమానులను కలవరపెడుతోంది.

Tags:    

Similar News