Viral Video: తరగతి గదిలో కాకుండా.. రోడ్డుపై కూర్చొని పరీక్ష రాసిన విద్యార్థులు!
Viral Video: బిహార్‌లో మరోసారి విద్యా వ్యవస్థ అభాసుపాలైంది. సివాన్ జిల్లాలో ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు రోడ్డు పక్కన కూర్చొని పరీక్షలు రాస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Viral Video: తరగతి గదిలో కాకుండా.. రోడ్డుపై కూర్చొని పరీక్ష రాసిన విద్యార్థులు!
Viral Video: బిహార్‌లో పరీక్షల నిర్వహణ తీరు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. గతంలో విమానాశ్రయ రన్‌వేపై పరీక్షలు రాసిన ఘటన మరువకముందే.. తాజాగా మరో షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు ఏకంగా రద్దీగా ఉండే రోడ్డుకు ఇరువైపులా కూర్చొని పరీక్షలు రాస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.
అసలేం జరిగిందంటే..?
బిహార్‌లోని సివాన్ జిల్లాలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ తమ విద్యార్థులకు పరీక్ష నిర్వహించింది. అయితే, ఆ సెంటర్‌లో విద్యార్థులకు సరిపడా గదులు లేదా ఇతర కనీస సదుపాయాలు లేకపోవడంతో.. నిర్వాహకులు వారిని బయటకు పంపించారు. దీంతో చేసేదేం లేక విద్యార్థులు రోడ్డు పక్కనే కూర్చొని, వాహనాల రాకపోకల మధ్యే తమ పేపర్లను పూర్తి చేశారు.
ఈ దృశ్యాలను స్థానికులు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. కొందరు విద్యార్థులు మోకాళ్లపై కూర్చొని రాస్తుంటే, మరికొందరు నిలబడి గోడకు పేపర్లు ఆనించి రాస్తున్న తీరు అందరినీ విస్మయానికి గురిచేసింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు:
ప్రభుత్వ పాఠశాలలు సరిగ్గా ఉంటే విద్యార్థులు ఇలాంటి సదుపాయాలు లేని కోచింగ్ సెంటర్లను ఎందుకు ఆశ్రయిస్తారని కొందరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, సౌకర్యాలు లేకపోయినా చదువుకోవాలనే కసితో విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని మరికొందరు ప్రశంసిస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో బిహార్ విద్యా వ్యవస్థలోని లోపాలను మరోసారి ప్రపంచానికి ఎత్తిచూపింది.