Nellore: రెవిన్యూ సిబ్బంది కొరత.. ప్రజలకు తీరని అవస్థలు

Nellore: నెల్లూరు జిల్లా అనంతసాగరం తహశీల్దార్ కార్యాలయంలో సిబ్బంది కొరత కారణంగా ధ్రువీకరణ పత్రాల జారీ నిలిచిపోయింది.

Update: 2026-04-13 06:42 GMT

Nellore: రెవిన్యూ సిబ్బంది కొరత.. ప్రజలకు తీరని అవస్థలు

ఆత్మకూరు: అనంతసాగరం తహసిల్దార్ కార్యాలయంలో సిబ్బంది కొరత వేధిస్తోంది తాసిల్దార్ డిప్యూటీ తాసిల్దార్ సీనియర్ అసిస్టెంట్ లేకపోవడంతో ధ్రువీకరణ పత్రాలు జారీలో ఆదర్శమవుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. గత రెండు నెలలుగా తహసిల్దార్ లేకపోవడంతో ప్రస్తుతం ఆత్మకూర్ తహసిల్దార్ పద్మావతి ఇంచార్జ్ తాసిల్దారులుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఏదైనా అత్యవసరమైతే తప్ప ఆత్మకూరుకు తీసుకెళ్లి చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా 19 రెవెన్యూ గ్రామాలకు కేవలం ఐదుగురు వీఆర్వోలు మాత్రమే ఉన్నారు. ఉన్నత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News