Karimnagar: నారాయణపూర్‌లో రోడ్డు భద్రతా కమిటీ.. ప్రాణాల రక్షణే లక్ష్యం!
Karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు 'రోడ్ సేఫ్టీ కమిటీ'ని ఏర్పాటు చేశారు.
Karimnagar: నారాయణపూర్‌లో రోడ్డు భద్రతా కమిటీ.. ప్రాణాల రక్షణే లక్ష్యం!
కరీంనగర్ జిల్లా: గంగాధర మండలం నారాయణపూర్ గ్రామ పంచాయతీలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా గ్రామ సభను నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ అభివృద్ధి అంశాలతో పాటు ముఖ్యంగా రోడ్డు భద్రతపై ప్రత్యేక చర్చ జరిగింది.
ఈ సందర్భంగా గ్రామంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు విలేజ్ లెవెల్ రోడ్ సేఫ్టీ కమిటీను ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచడం, భద్రతా చర్యలను పాటించేలా ప్రోత్సహించడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు.
గ్రామ సర్పంచ్ దీకొండ బాబలక్ష్మి మధు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వడం ప్రమాదకరమని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బత్తిని వెంకటరమణ, గ్రామ కార్యదర్శి దీపక్ కుమార్, పాలకవర్గ సభ్యులు, సేఫ్టీ కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.