Karimnagar: కరీంనగర్‌లో రైతు సంఘం జిల్లా మహాసభలు
Karimnagar: కరీంనగర్‌లో తెలంగాణ రైతు సంఘం 9వ జిల్లా మహాసభలు ప్రారంభమయ్యాయి.
Karimnagar: కరీంనగర్‌లో రైతు సంఘం జిల్లా మహాసభలు
Karimnagar: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమ పోరాటాలు నిర్వహిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. జంగారెడ్డి అన్నారు. తెలంగాణ రైతు సంఘం కరీంనగర్ జిల్లా 9వ మహాసభలు ముకుంద లాల్ మిశ్రా భవన్లో ప్రారంభమయ్యాయి.
మహాసభ ప్రారంభ సూచికగా సంగం సీనియర్ నాయకులు వర్ణ వెంకటరెడ్డి పతాకావిష్కరణ చేశారు. అధ్యక్ష వర్గంగా కే అరుణ, వెంకట్ రెడ్డిలు వ్యవహరించారు. స్టీరింగ్ కమిటీగా ఆఫీస్ బేరర్స్ ఏడు మంది వ్యవహరించారు. రైతాంగ ఉద్యమంలో అమరులైన సామినేని రామారావు, కాసాని ఐలయ్య మరియు ప్రకృతి వైపరీత్యాల వల్ల మరణించిన వారికి మహాసభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం పి. జంగారెడ్డి మహాసభ ప్రారంభోపన్యాసం చేశారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తెస్తూ వ్యవసాయ రంగాన్ని ముఖ్యంగా రైతాంగాన్ని నష్టపరిచే విధానాలు కొనసాగిస్తుందన్నారు. కరోనా కష్ట కాలంలో కేంద్ర బిజెపి తెచ్చిన మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు రైతులు ఐక్య సమరశీల పోరాటం నిర్వహిస్తే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి నల్ల చట్టాలు రద్దు చేసిందని గుర్తు చేశారు.
ఆ సందర్భంగా రైతాంగ ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇచ్చి నేటికీ హామీలు అమలు చేయలేదన్నారు. ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. అన్ని రకాల పంటలకు మద్దతు ధరను చట్టబద్ధం చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు.
అవే నల్ల చట్టాలను మళ్లీ దొడ్డి దారిన తెస్తున్నారన్నారు. రైతులకు ఎలాంటి ఉపయోగం లేని విత్తన చట్టాన్ని తెచ్చారని,ఇది పూర్తిగా కార్పొరేట్లకు బహుళ జాతి సంస్థలకు ఉపయోగపడుతుందన్నారు. విద్యుత్ సంస్కరణ చట్టంతో రైతాంగం పై మరింత ఆర్థిక భారంపడే విధంగా ఉందన్నారు. రైతులకు ఉచిత కరెంటు అందకుండా చేసే కుట్రలో భాగమేనన్నారు. సబ్సిడీలు ఎత్తివేసే
ప్రమాదం ఉందన్నారు. సామ్రాజ్యవాదంతో రైతాంగానికి అనేక ఇబ్బందులు వస్తున్నాయన్నారు. యుద్దాల వల్ల రైతాంగానికి ప్రత్యక్ష నష్టాలు చవిచూస్తున్నారన్నారు. బియ్యం ధరలు పడిపోతున్నాయని, నిత్యవసర వస్తువుల ధరలు, గ్యాస్, పెట్రోల్ ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయన్నారు. 2014 ఎన్నికలకు ముందు బిజెపి మోడీ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ప్రొఫెసర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని,
అన్ని రకాల పంటలకు మద్దతు ధరలు కల్పిస్తామని, రైతుకు రెట్టింపు ఆదాయాన్ని ఇస్తామని హామీ ఇచ్చిందని, నేటికి హామీలు కలగానే మిగిలాయని, పైగా రైతు నడ్డి విరిచే విధంగా చట్టాలు తెస్తున్నారు అన్నారు. అన్ని రకాల పంటలకు మద్దతు ధరలు కల్పించి చట్టం చేయాలని డిమాండ్ చేశారు. సన్నా చిన్నకారూ రైతులకు ఎరువులు పురుగుమందులు ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
రైతాంగానికి సరిపడా యూరియా అందించాలన్నారు. రైతులకు ఉపయోగం లేని, ఇబ్బందులకు గురి చేసే కిసాన్ యాప్ ను తొలగించాలన్నారు. 55 సంవత్సరాలు దాటిన ప్రతి రైతుకు పెన్షన్ ప్రకటించి ఇవ్వాలన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల రైతాంగ రుణాలు మాఫీ చేసి వ్యవసాయానికి కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బ్యాంకులు 18 శాతం రుణాలు రైతులకు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఆరు శాతం మాత్రమే రుణాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ పాలనలో ప్రొఫెసర్ జయతి గోష్ కమిషన్ వేసిందని గుర్తు చేశారు. కమిషన్ సిఫార్సులు అమలు చేయకుండా నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేశాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఉన్న సాదా బైనామాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్ రైతులకు అనుకూలంగా మార్చాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులను గుర్తించి, గుర్తింపు కార్డులు ఇచ్చి కౌలు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గ్రామ గ్రామాన కమిటీలు వేసి రైతులను చైతన్యం చేసి రైతు వ్యతిరేక విధానాలపై ఐక్య సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో రాష్ట్ర సహాయ కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వర్ణ వెంకటరెడ్డి, వెలమారెడ్డి రాజిరెడ్డి, జిల్లా ఆఫీస్ బేరర్స్ మిల్కూరి వాసుదేవ రెడ్డి, బాసిర సంపత్ రావు, గుండేటి వాసుదేవ్, జునూతుల జనార్దన్ రెడ్డి, శీలం అశోక్, చేలుపూరి రాములు, జిల్లా కమిటీ సభ్యులు నూనె శేఖర్, లంబు లక్ష్మారెడ్డి, టి శ్రీకాంత్, స్వప్న, రోంటాల ఉమారెడ్డి, మండలాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.