Medak: కుళ్ళిన పదార్థాలతో వంటలా.. మెదక్ చైర్‌పర్సన్ ఆగ్రహం

Medak: మెదక్ నర్సింగ్ కళాశాలలోని సమస్యలను పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక భూపతి రాజు హామీ ఇచ్చారు.

Update: 2026-04-12 13:41 GMT

Medak: కుళ్ళిన పదార్థాలతో వంటలా.. మెదక్ చైర్‌పర్సన్ ఆగ్రహం

Medak: జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలలో ఉన్న సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని దీనిలో విద్యార్థులు ఎలాంటి ఆలోచన చేయవద్దని సమస్యలను పట్టించుకోని బాధ్యతలు పై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తానని మెదక్ మున్సిపల్ చైర్ పర్సన్ రాధిక భూపతి రాజు అన్నారు ఆదివారం నర్సింగ్ కళాశాలలో సందర్శించి విద్యార్థులతో మాట్లాడటం జరిగింది,

అని వారి సమస్యలను విని తక్షణమే స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు విద్యార్థుల సమస్యలపై మాట్లాడడం జరిగిందని చైర్పర్సన్ రాధిక భూపతి రాజు తెలిపారు కళాశాలలో సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందని విద్యార్థులతో కలిసి మాట్లాడటం జరిగిందని ఆమె అన్నారు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరించడం జరుగుతుంది అని అంతేగాకుండా నర్సింగ్ కళాశాల ఆవరణ లో గల అపరిశుభ్రత వాతావరణం,

వంటగదిలో ఉన్న సామాగ్రి నిలువలను అక్కడే ఉన్న సిబ్బందితో అడిగి తెలుసుకోవడం జరిగిందని ఆపరిశుభ్ర వాతావరణంలో, కుళ్ళిన వదార్థాలతో వంటలు చేసి భోజనం పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిపారు. విద్యార్థినీల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు ఆదేహిస్తున్నట్లు చైర్పర్సన్తో చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కానుగు భూపతిరాజ్, నర్సింగ్ కళాశాల సిబ్బంది ఉన్నారు.

Tags:    

Similar News