Asifabad: పోలీస్ స్టేషనే ఇక లైబ్రరీ.. యువతకు డీజీపీ పిలుపు

Asifabad: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో పాత పోలీస్ స్టేషన్‌ను గ్రంథాలయంగా మార్చారు.

Update: 2026-04-12 13:05 GMT

Asifabad: పోలీస్ స్టేషనే ఇక లైబ్రరీ.. యువతకు డీజీపీ పిలుపు

Asifabad: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలోని పాత పోలీస్ స్టేషన్‌ను ఆధునిక సదుపాయాలతో గ్రంథాలయంగా అభివృద్ధి చేసి, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువత కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈగ్రంథాలయాన్ని రాష్ట్ర డిజిపి బి. శివధర్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు మెరుగైన చదువు వాతావరణం కల్పించడం, పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించేందుకు అవసరమైన వనరులు అందించడం లక్ష్యంగా ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు.

గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు, సాధన మెటీరియల్, ప్రస్తుత వ్యవహారాల పుస్తకాలు, మరియు వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే గ్రంథాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రశాంతమైన చదువు వాతావరణంతో పాటు, యువతకు ఉపయుక్తమైన అన్ని సదుపాయాలు కల్పించినట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News