Karimnagar: మంగపేట రైల్వే గేటు వద్ద భారీ ట్రాఫిక్ జామ్.. గంటపాటు ప్రయాణికుల అవస్థలు!
Karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మంగపేట రైల్వే గేటు వద్ద భారీ వాహనం చెడిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Karimnagar: మంగపేట రైల్వే గేటు వద్ద భారీ ట్రాఫిక్ జామ్.. గంటపాటు ప్రయాణికుల అవస్థలు!
కరీంనగర్ జిల్లా: గంగాధర మండలంలోని మంగపేట రైల్వే గేటు వద్ద సోమవారం ఉదయం భారీ ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఒక భారీ వాహనం రైల్వే గేటు సమీపంలో అకస్మాత్తుగా మోరాయించి చెడిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
దాదాపు గంటకు పైగా వాహనాలు రెండు వైపులా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యంగా ఉద్యోగాలకు, పాఠశాలలకు వెళ్లే వారు ఆలస్యానికి గురయ్యారు. కొందరు ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాల్సి వచ్చింది.
చెడిపోయిన వాహనాన్ని అక్కడి నుండి తొలగించే చర్యలు చేపట్టడంతో క్రమంగా ట్రాఫిక్ సజావుగా మారింది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.