Karimnagar: క్రీడలతోనే క్రమశిక్షణ.. చొప్పదండి ఫస్ట్ వార్డులో సందడి!

Karimnagar: కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపల్ చైర్‌పర్సన్ వడ్లూరి సరిత శ్రీనివాస్ యువతకు క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు.

Update: 2026-04-13 07:04 GMT

Karimnagar: క్రీడలతోనే క్రమశిక్షణ.. చొప్పదండి ఫస్ట్ వార్డులో సందడి!

Karimnagar: చొప్పదండి పట్టణంలో యువతకు ప్రోత్సాహం అందించే దిశగా ఒక మంచి కార్యక్రమం జరిగింది. పట్టణంలోని ఫస్ట్ వార్డ్‌లో యువకుల క్రీడా అభిరుచిని గుర్తించిన మున్సిపల్ చైర్‌పర్సన్ వడ్లూరి సరిత శ్రీనివాస్ క్రికెట్ సామగ్రిని అందజేశారు.

యువత క్రీడల్లో మరింత చురుకుగా పాల్గొనాలని ప్రోత్సహిస్తూ బ్యాట్లు, బాల్స్‌ను స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక యువకులు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు. క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ, జట్టు భావనను పెంపొందిస్తాయని చైర్‌పర్సన్ తెలిపారు.

ఇలాంటి సహకారం వల్ల యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెరిగి, భవిష్యత్తులో మంచి క్రీడాకారులు అవుతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వార్డ్‌కు చెందిన ప్రజలు, యువకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News