Viral Video: ఇరాన్ దెబ్బకు చిల్లులు పడ్డ అమెరికా విమానం..!

Viral Video: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం అగ్రరాజ్యం అమెరికాకు కోలుకోలేని దెబ్బ తీస్తోంది.

Update: 2026-04-13 06:27 GMT

Viral Video: ఇరాన్ దెబ్బకు చిల్లులు పడ్డ అమెరికా విమానం..!

Viral Video: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం అగ్రరాజ్యం అమెరికాకు కోలుకోలేని దెబ్బ తీస్తోంది. ఇరాన్ జరిపిన భీకర దాడుల్లో అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలు భారీగా ధ్వంసమవుతున్నాయి. తాజాగా, ఇరాన్ క్షిపణి దాడులకు గురై, మరమ్మతులు చేసుకున్న అమెరికాకు చెందిన కేసీ-135ఆర్ (KC-135R) ట్యాంకర్ విమానం యూకే గగనతలంపై ప్రయాణిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

వైరల్ వీడియో వివరాలు:

యూకేలోని ఆర్‌ఏఎఫ్ మిల్డెన్‌హాల్ మీదుగా ప్రయాణిస్తున్న ఈ విమానాన్ని ఏవియేషన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ మెక్‌కెల్వీ కెమెరాలో బంధించారు. ఈ విమానం పైభాగంలో తూట్లు పడిన గుర్తులు, వాటికి చేసిన ప్యాచ్ వర్క్ (మరమ్మతులు) స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత నెలలో సౌదీ అరేబియాలోని వైమానిక స్థావరంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో దెబ్బతిన్న ఐదు విమానాల్లో ఇది ఒకటిగా భావిస్తున్నారు.

అమెరికాకు భారీ వైమానిక నష్టం:

యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా వైమానిక దళానికి జరిగిన నష్టంపై అంతర్జాతీయ మీడియా దిగ్భ్రాంతికర గణాంకాలను వెల్లడించింది. ఇప్పటివరకు అమెరికాకు చెందిన 39 విమానాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో 10 విమానాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కూలిపోయిన వాటిలో ఒక ఏ-10 (A-10), నాలుగు ఎఫ్‌-15ఈ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. అమెరికా అత్యంత గర్వంగా చెప్పుకునే ఐదో తరం ఎఫ్‌-35 స్టెల్త్ యుద్ధ విమానం కూడా ఇరాన్ దాడుల్లో దెబ్బతినడం గమనార్హం.

ధ్వంసమైన విమానాలను ఎలాగోలా రిపేర్ చేసి తిరిగి రంగంలోకి దించేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నట్లు ఈ వైరల్ వీడియో ద్వారా స్పష్టమవుతోంది. టెహ్రాన్ దాడుల ధాటికి అగ్రరాజ్య రక్షణ కవచాలు సైతం విఫలమవుతున్నాయని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.


Tags:    

Similar News