Nampally Fire Accident: బిల్డింగ్‌లో చిక్కుకున్న 23 మంది.. ప్రాణాలకు తెగించి కాపాడిన ఫైర్ సిబ్బంది!
Nampally Fire Accident: హైదరాబాద్ నాంపల్లి రెడ్ హిల్స్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.
Nampally Fire Accident: నాంపల్లి రెడ్ హిల్స్ ప్రాంతంలో సోమవారం ఉదయం ఒక్కసారిగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక మూడంతస్తుల భవనంలోని మూడవ అంతస్తులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
భవనంలోని మూడవ ఫ్లోర్‌లో మంటలు మొదలై వేగంగా వ్యాపించాయి. ఈ క్రమంలో భవనం లోపల సుమారు 23 మంది నివాసితులు చిక్కుకుపోయారు. దట్టమైన పొగ కమ్ముకోవడంతో వారు బయటకు రాలేక ఇబ్బంది పడ్డారు.
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక దళం ఘటనా స్థలానికి చేరుకుంది. ఫైర్ సిబ్బంది సాహసోపేతంగా వ్యవహరించి, మంటలను అదుపు చేస్తూనే లోపల ఉన్న 23 మందిని ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు స్థానికులు మరియు అధికారులు భావిస్తున్నారు.
అగ్నిమాపక సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, అందరూ సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నామని బాధితులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.