Hyderabad: కట్నం కోటిన్నర.. ఐడీ కార్డు నకిలీ.. ఖంగుతిన్న వధువు!

Hyderabad: హైదరాబాద్‌లోని చైతన్యపురిలో నకిలీ కేంద్ర ప్రభుత్వ అధికారి పనస మధుగౌడ్ అరెస్ట్. ఎఫ్.సి.ఐ మేనేజర్ అని నమ్మించి యువతితో నిశ్చితార్థం చేసుకున్న నిందితుడు.

Update: 2026-04-13 01:47 GMT

Hyderabad: కట్నం కోటిన్నర.. ఐడీ కార్డు నకిలీ.. ఖంగుతిన్న వధువు!

ఎల్బీనగర్: కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి ఉద్యోగి అంటూ యువతిని మోసం చేసి నిశ్చితార్ధం చేసుకున్న ఒకేటుగాడిని చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.

ఈ సంఘటన ఆదివారం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం. నల్లగొండ జిల్లా మాడుగుల మండలం చెరువుపల్లి గ్రామానికి చెందిన పనస మధుగౌడ్ (30) కొంతకాలం క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్ మహానగరంలోని అల్కాపురి కాలనీ కొత్తపేట వచ్చి అద్దె గదిలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పటికీ సాధ్యం కాకపోవడంతో మధుగౌడ్ నకిలీ కేంద్ర ప్రభుత్వ అధికారిగా అవతారం ఎత్తాడు. మేడ్చల్ ప్రాంతంలోని చర్లపల్లిలో కేంద్ర ప్రభుత్వ శాఖ అయినటువంటి ఎఫ్సీఐ విభాగంలో గ్రేట్ 3 టెక్నికల్ విభాగాల్లో మేనేజర్ అంటూ నమ్మించి నల్గొండ జిల్లా ప్రాంతానికి చెందిన ఓ యువతని రూ రెండు కోట్లు కట్నం డిమాండ్ చేసి కోటిన్నర రూపాయలకు కట్నం ఒప్పందం చేసుకొని ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు బాధితురాలు పోలీసులకు వెల్లడించింది. వివాహ ఏర్పాట్లలో భాగంగా ఫ్రీ వెడ్డింగ్ పేరుతో బాధిత యువతని హైదరాబాద్ కు రప్పించి తాను నివాసం ఉంటున్న

అల్కాపురి రావడంతో బాధిత యువతిపైనే లేనిపోని అబాండాలతో నిందలు వేసి ఇబ్బంది పెట్టడంతో బాధిత యువతకి అనుమానం వచ్చింది. ఈ క్రమంలో మధుగౌడ్ వ్యవహార శైలిపై కూపి లాగడంతో నకిలీ ఐడీ కార్డు తయారీ అంశం వెలుగులోకి రావడంతో బాధితురాలు చైతన్యపురి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అంటూ మధుగౌడ్ తనను మోసం చేసి ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో పాటు వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు తన గోడు వెళ్ళబోసుకుంది.

బాధితురాలు ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు మధుగౌడ్ ను అదుపులోకి తీసుకొని అతని వద నకిలీ ఐడీ కార్డును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

Tags:    

Similar News