Mahesh Kumar Goud: పోచారం గారు.. రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకోండి
Mahesh Kumar Goud: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి విమర్శలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.
Mahesh Kumar Goud: పోచారం గారు.. రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకోండి
Mahesh Kumar Goud: సిద్ధాపూర్ (పెద్దాపూర్) రిజర్వాయర్ నిధుల విషయంలో ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పోచారం పెద్ద మనసుతో ఆలోచించాలని ఆయన కోరారు.
గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని, ప్రతి నెలా సుమారు రూ. 7,000 కోట్ల అప్పులు చెల్లిస్తున్నామని మహేష్ గౌడ్ వెల్లడించారు. సీనియర్ నాయకుడైన పోచారం శ్రీనివాస రెడ్డి ఈ పరిస్థితులను అర్థం చేసుకోవాలని, నిధుల విడుదల విషయంలో కొన్ని సాంకేతిక లేదా ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చని పేర్కొన్నారు.
ప్రజా సంక్షేమంతో పాటు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే ఆర్థిక వనరుల సర్దుబాటుకు కొంత సమయం పడుతుందని స్పష్టం చేశారు. నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా అని పోచారం చేసిన ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో, మహేష్ గౌడ్ సంయమనంతో స్పందిస్తూనే ప్రస్తుత ఆర్థిక వాస్తవాలను వివరించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.