Penchalakona: పెంచలకోన బ్రహ్మోత్సవాల సమీక్ష సమావేశం వాయిదా
Penchalakona: పెంచలకోన క్షేత్రంలో ఏప్రిల్ 27 నుండి జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల తొలి సమీక్షా సమావేశం వాయిదా పడింది.
Penchalakona: పెంచలకోన బ్రహ్మోత్సవాల సమీక్ష సమావేశం వాయిదా
Penchalakona: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోన క్షేత్రంలో 2026 ఏప్రిల్ 27 నుండి మే 3 వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై నిర్వహించాల్సిన మొదటి సమీక్ష సమావేశం వాయిదా పడింది.
ముందుగా ఏప్రిల్ 2న నిర్వహించాలని నిర్ణయించిన ఈ సమావేశాన్ని అనివార్య కారణాల వల్ల ఏప్రిల్ 3న జరుగుతుందని ఈ వో పోరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశం ఆర్యవైశ్య సత్రంలో, నెల్లూరు ఆర్డీవో ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి ఆర్టీసీ, ఎలక్ట్రికల్, శానిటేషన్, పోలీస్, రెవెన్యూ, వైద్య శాఖ అధికారులు, పాల్గొంటారని తెలిపారు.