Nellore: ఆత్మకూరులో పోలీసుల 'కార్డన్ సెర్చ్'.. రికార్డులు లేని 57 వాహనాలు సీజ్!

Nellore: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 50 బైకులు, 3 కార్లు, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.

Update: 2026-04-13 04:36 GMT

Nellore: ఆత్మకూరులో పోలీసుల 'కార్డన్ సెర్చ్'.. రికార్డులు లేని 57 వాహనాలు సీజ్!

ఆత్మకూరు: ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరుపాలెం ముస్లిం కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాలతో ఆత్మకూరు డీఎస్పీ కే. వేణుగోపాల్ సూచనలతో ఆత్మకూరు సంగం సిఐలు గంగాధర్, శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో ఇద్దరు సీఐల పాటుగా 8 మంది ఎస్ఐలు 40 మంది పోలీసులు పాల్గొన్నారు.. ప్రతి ఇంటిని పరిశీలించి ఇక్కడ నివసించి వారి వివరాలు తెలుసుకుంటూ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీవాసులకు సీఐ గంగాధర్ పలు సూచనలు చేశారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సరైన పత్రాలతో వాహనాలు కలిగి ఉండాలని,సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా కొత్త వ్యక్తుల సంచారంపై పర్యవేక్షణ చేయాలంటూ స్థానికులకు సూచించారు. ఈ తనిఖీ లో సరైన పత్రాలు లేని 50 స్కూటర్లు, మూడు కార్లు, నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News