Cucumber Farming: కేవలం 50 రోజుల్లోనే లక్షల లాభం వచ్చే ఏకైక పంట

Cucumber Farming: కేవలం 50 రోజుల్లో లక్షల లాభం పొందాలంటే దోసకాయ సాగు సరైన ఎంపిక.

Update: 2026-04-13 06:08 GMT

Cucumber Farming

Cucumber Cultivation: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్‌లో దోసకాయలకు ఎక్కడ లేని డిమాండ్ పెరుగుతుంది. తక్కువ పెట్టుబడి, తక్కువ కాలంలో చేతికి వచ్చే పంట కావడంతో రైతన్నలకు ఇది ఒక కాసుల వర్షం కురిపించే పంటగా మారింది. దోసకాయ సాగును శాస్త్రీయంగా, సరైన సమయంలో చేపడితే ఎకరాకు లక్షల్లో లాభాలు గడించడం అసాధ్యమేమీ కాదు.

ఎప్పుడు వేయాలంటే?

దోసకాయ పంటను ఏడాది పొడవునా పండించవచ్చు, కానీ అత్యధిక లాభాలు రావాలంటే జనవరి రెండో వారం నుండి ఫిబ్రవరి చివరి వరకు విత్తనాలు నాటుకోవడం ఉత్తమం. ఈ సమయంలో పంట వేస్తే, ఎండలు తీవ్రమయ్యే మార్చి, ఏప్రిల్ నెలల్లో కోతలు ప్రారంభమవుతాయి. ఎండల వల్ల మార్కెట్‌లో దోసకాయలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది, తద్వారా మంచి ధర లభిస్తుంది. ఖరీఫ్ సీజన్ కోసం జూన్-జూలై నెలల్లో కూడా సాగు చేయవచ్చు.

ఎకరాకు పెట్టుబడి అంచనా

దోసకాయ సాగులో ఖర్చు ప్రధానంగా విత్తనాలు, మల్చింగ్ , ఎరువులపై ఉంటుంది. దుక్కి దున్నడం, బెడ్స్ తయారు చేయడం కోసం సుమారు రూ.5,000 నుండి రూ.7,000 ఖర్చవుతుంది. నాణ్యమైన హైబ్రిడ్ విత్తనాలకు ఎకరాకు రూ.4,000 నుండి రూ.6,000 వరకు ఖర్చు అవుతుంది. ఆధునిక పద్ధతిలో మల్చింగ్ పేపర్ వాడితే కలుపు నివారణ జరిగి దిగుబడి పెరుగుతుంది. దీనికి సుమారు రూ.12,000 ఖర్చు కావచ్చు. దోసకాయకు పిందె కుళ్లుడు, తీగ జాతి పురుగులు ఆశించకుండా జాగ్రత్త పడాలి. దీనికి రూ.8,000 వరకు ఖర్చవుతుంది. కోతలు, ప్యాకింగ్ , రవాణా కోసం మరో రూ.10,000 అవసరమవుతాయి. సుమారుగా ఎకరాకు రూ.40,000 నుండి రూ.50,000 వరకు ఉంటుంది.

దిగుబడి మరియు లాభాల విశ్లేషణ

దోసకాయ పంట కేవలం 45 నుండి 55 రోజుల్లోనే కోతకు వస్తుంది. ఇది రైతుకు అతి తక్కువ కాలంలో నగదు అందించే పంట. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 15 నుండి 20 టన్నుల దిగుబడి సాధించవచ్చు. వేసవి కాలంలో కిలో దోసకాయ ధర హోల్‌సేల్ మార్కెట్‌లో సగటున రూ.15 నుండి రూ.25 వరకు ఉంటుంది. ఒక్కోసారి డిమాండ్ పెరిగితే రూ.30 దాటే అవకాశం కూడా ఉంది. కనిష్టంగా కిలో రూ.15 చొప్పున 15 టన్నుల (15,000 కిలోలు) దిగుబడిని లెక్కవేసినా.. 15,000×15=రూ.2,25,000 రాబడి వస్తుంది. మొత్తం రాబడి (రూ.2,25,000) నుండి పెట్టుబడి (రూ.50,000) తీసివేస్తే.. కేవలం రెండు మూడు నెలల్లోనే రైతుకు రూ.1,75,000 నికర లాభం మిగులుతుంది.

దోసకాయ సాగు అనేది తక్కువ కాలం, ఎక్కువ లాభం ఇచ్చే వ్యాపార వంటిది. నీటి సౌకర్యం ఉండి, మార్కెట్ ధరలపై అవగాహన ఉన్న రైతులకు ఇది నిశ్చయంగా ఒక బంగారు బాతు లాంటి పంట. కాబట్టి, పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తే ఈ వేసవిలో రైతు లక్షాధికారి కావడం ఖాయం.

Tags:    

Similar News