AP Online Betting Ban: ఏపీలో బెట్టింగ్ రాయుళ్లపై ఉక్కుపాదం.. డీజీపీ కీలక ఆదేశాలు!

AP Online Betting Ban: ఏపీలో ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పోలీసు అధికారులను ఆదేశించారు.

Update: 2026-04-13 05:01 GMT

AP Online Betting Ban: ఏపీలో బెట్టింగ్ రాయుళ్లపై ఉక్కుపాదం.. డీజీపీ కీలక ఆదేశాలు!

AP Online Betting Ban: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ (జూదం)పై ప్రభుత్వం సమరం ప్రకటించింది. సమాజానికి శాపంగా మారిన ఈ వ్యసనాలపై 'జీరో టాలరెన్స్' విధానాన్ని అవలంబించాలని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా క్షేత్రస్థాయి పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఎక్కడైనా క్లబ్బుల్లో లేదా రహస్య ప్రదేశాల్లో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తిస్తే, వాటిని తక్షణమే సీజ్ చేయాలని డీజీపీ ఆదేశించారు. బెట్టింగ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు, బుకీలు మరియు ఏజెంట్లపై కేవలం సాధారణ కేసులు కాకుండా, 'ఆర్గనైజ్డ్ క్రైమ్' కింద కఠిన కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు.

ఆన్‌లైన్ బెట్టింగ్‌ల వలయంలో పడి యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, ఆర్థికంగా మరియు మానసిక ఇబ్బందులకు గురికావద్దని డీజీపీ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు తమ పరిధిలో నిఘా పెంచాలని, ఆన్‌లైన్ వెబ్‌సైట్లు మరియు యాప్‌ల ద్వారా బెట్టింగ్ నిర్వహించే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags:    

Similar News