Nellore: నెల్లూరులో పోలీసుల మెరుపు తనిఖీలు.. ఆర్డీటీ కాలనీ దిగ్బంధం!
Nellore: నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు ఆర్డీటీ కాలనీలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.
Nellore: నెల్లూరులో పోలీసుల మెరుపు తనిఖీలు.. ఆర్డీటీ కాలనీ దిగ్బంధం!
Nellore: నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని RDT కాలనీలో, SHO శ్రీ వేణు మరియు వారి సిబ్బంది ఆధ్వర్యంలో Cordon and Search Operation (CASO) ఈ రోజు సాయంత్రం 6.00 pm నుండి 8.30 pm మధ్య నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మొత్తం 17 మోటార్ సైకిళ్లు, 4 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అదనంగా ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు...
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ..
హెల్మెట్ వినియోగం మరియు రోడ్డు భద్రత మీద అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.
NDPS చట్టానికి సంబంధించిన అంశాలు, బాలకార్మికులు దుర్వినియోగం నివారణ, ఇతర ప్రజా భద్రత అంశాలు, పోక్సో చట్టాల మీద అవగాహన వుండాలని సూచించారు...ఈ కార్యక్రమం శాంతి భద్రతలను మెరుగుపరచడం మరియు ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో భాగంగా జిల్లా SP సూచనలు మేరకు ఈ ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించామని చెప్పారు ఘట్టమనేని శ్రీనివాసరావు..