Atmakur: 90 ఏళ్ల కిసాన్ సంఘ ప్రస్థానం.. ఆత్మకూరులో ఘనంగా వేడుకలు

Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆల్ ఇండియా కిసాన్ సంఘ 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

Update: 2026-04-11 06:27 GMT

Atmakur: 90 ఏళ్ల కిసాన్ సంఘ ప్రస్థానం.. ఆత్మకూరులో ఘనంగా వేడుకలు

ఆత్మకూరు: ఆల్ ఇండియా కిసాన్ సంఘ 90 వ ఆవిర్భావ దినోత్సవం ఆత్మకూరు మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆత్మకూరు మండల అధ్యక్షుడు కృష్ణమోహన్ ఆధ్వర్యంలో సుమారు 30 మంది రైతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యల పట్ల రైతుల ఉత్పత్తులకు తగిన మద్దతు ధర లేకపోవడం సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడం దశాబ్దాల తరబడి నిర్మాణానికి నోచుకోకపోవడం ఇలా వ్యవసాయ రంగం నిర్లక్ష్యానికి గురై పడుతున్నదని వివిధ రైతు సంఘాల సమన్వయ కార్యక్రమాలను రూపొందిస్తున్న ఆల్ ఇండియా కిసాన్ కార్యక్రమాలను ఆదరించి రైతు సంఘ కార్యక్రమాలకు మద్దతుగా రైతులు నిలబడాలని రైతు సంఘ నాయకులు కృష్ణ ప్రసాద్ కృష్ణమోహన్ శ్రీనివాసులు రెడ్డి వెంకట్రామిరెడ్డి గౌస్ మోహిద్దీన్ తదితరులు కోరారు.

Tags:    

Similar News