Peddapalli: సుల్తానాబాద్ ప్రజల కల సాకారం.. మినీ ట్యాంక్ బండ్‌కు నిధుల వర్షం!

Peddapalli: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఊర చెరువు మినీ ట్యాంక్ బండ్‌గా మారనుంది. ప్రభుత్వం రూ. 8.77 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2026-04-11 08:22 GMT

Peddapalli: సుల్తానాబాద్ ప్రజల కల సాకారం.. మినీ ట్యాంక్ బండ్‌కు నిధుల వర్షం!

Peddapalli: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ.చింతకుంట విజయరమణ రావు గారు..

గత ప్రభుత్వ హయాంలో సుల్తానాబాద్ పట్టణంలో అభివృద్ధికి నోచుకోని ఊర చెరువుకు ఎట్టకేలకు మహర్దశ లభించి. ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు గారు ఇచ్చిన మాట ప్రకారం ఊర చెరువును మినీ ట్యాంక్ బండ్ గా సుందరీకరణ చేసేందుకు రూ. 8 కోట్ల 77 లక్షల 50 వేల రూపాయలు మంజూరి చేయించారు. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఈ. శ్రీధర్ గారు జీవో 170 ద్వారా ఉత్తర్వులు జారీ చేసినట్టు గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు తెలిపారు..

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు మాట్లాడుతూ..

చాలా కాలంగా ఊర చెరువును అభివృద్ధి చేస్తామని గతంలోని పాలకులు మాయ మాటలు చెప్పి పబ్బం గడుపుకున్నారు. దీంతో రాను రాను చెరువు కట్టకు బుంగలు ఏర్పడి ప్రమాదకర పరిస్థితికి ఏర్పడింది. అలాగే సాగునీటి స్థిరీకరణ కూడా కుంటుపడింది. రైతులు చాలాకాలంగా ఇబ్బందులు పడుతూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఎన్నికల్లో మేము ఇచ్చిన హామీ మేరకు చెరువును మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేసేందుకు పట్టుదలతో కృషిచేసి నిధులు మంజూరు చేయించడం జరిగిందని వెంటనే టెండర్లు పిలిచి పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అన్నారు. సుల్తానాబాద్ మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి నిధుల మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు నీటిపారుదల మరియు ఆహార & పౌర సరఫరాల శాఖ మాత్యులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరియు జిల్లా మంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు గారు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా సుల్తానాబాద్, సుగ్లాంపల్లె, కందునూరుపల్లె తో పాటు చెరువు కింద పంట పొలాలు సాగు చేసే వివిధ గ్రామాల రైతాంగానికి శుభాకాంక్షలు తెలియజేశారు. చెరువు కట్ట ఆధునికరణ వల్ల సాగునీటి స్థిరీకరణతో పాటు సుల్తానాబాద్ పట్టణంలో బావుల్లో సైతం నీటి నిలువలు పెరుగుతాయని ఎమ్మెల్యే విజయరమణ రావు గారు తెలిపారు. సుల్తానాబాద్ పట్టణ అభివృద్ధిలో భాగంగా ఈ చెరువును అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజల ఆశీస్సులతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేపించినందుకు సుల్తానాబాద్ ప్రాంత ప్రజలు మరియు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News