Srikakulam: అంబేడ్కర్ ఆశయాలే దేశానికి వెలుగు.. కవిటి పాఠశాలలో వేడుకలు!
Srikakulam: శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలోని శ్రీ కళ్యాణి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
Srikakulam: అంబేడ్కర్ ఆశయాలే దేశానికి వెలుగు.. కవిటి పాఠశాలలో వేడుకలు!
Srikakulam: ముందస్తు అంబేద్కర్ జయంతి వేడుకలు.. కవిటి మండల్ హెడ్ క్వార్టర్ లో గల శ్రీ కళ్యాణి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు అంబేద్కర్ జయంతి వేడుకలను పాఠశాల ఆవరణంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి కరస్పాండెంట్ లాల రాజేష్ పూలమాల అలంకరణ చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం భారతదేశం ఇంత అభివృద్ధి పథంలో వెళ్లటానికి అంబేద్కర్ కారణము అని అన్నారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నేటికీ భారతదేశంలో కొనసాగుతుందని అన్నారు. అనంతరం మాట్లాడిన ప్రిన్సిపాల్ బిందు మాధవి రాజ్యాంగ పీఠికలో అనేక నిబంధనలు ప్రవేశపెట్టి అన్ని కుల మత వర్గాలకు ఎటువంటి కారణం లేకుండా రచించిన రాజ్యాంగం భారత రాజ్యాంగం అని దానికి ముఖ్య వ్యక్తి అంబేద్కర్ అన్నారు. అనంతరం మాట్లాడిన ఏవో రాణి అంబేద్కర్ యొక్క బాల్యము విద్యాభ్యాసం గూర్చి విద్యార్థులకు చెప్తూ స్వతంత్ర ఉద్యమంలో ఏప్రిల్ 13 కు మంచి చరిత్ర ఉందని జలియన్వాలా బాగా సంఘటన జరిగిన రోజు అని గుర్తు చేసుకుంటూ విద్యార్థులకు జలియన్వాలాబాగ్ సంఘటన గూర్చి తెలియజేశారు.
అనంతరం ఆ సంఘటనలో మరణించిన భారతీయుల ఆత్మకు శాంతి కలగాలని కొద్ది క్షణాలు మౌనం పాటించారు. అనంతరం విద్యార్థులతో అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రపై వకృతం పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.