ఏపీ రాజధానిగా అమరావతి పదేళ్ల అనిశ్చితికి ముగింపు పలికే దిశగా అడుగులు
Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక గుర్తింపు లభించనుంది.
ఏపీ రాజధానిగా అమరావతి పదేళ్ల అనిశ్చితికి ముగింపు పలికే దిశగా అడుగులు
Amaravati: ఏప్రిల్ 1న అమరావతిను అధికారిక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంట్‌లో ఆమోదం లభించే అవకాశమున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత రాజధాని అంశం చుట్టూ సాగిన అనిశ్చితికి ఇది ముగింపు పలికే నిర్ణయంగా నిలవొచ్చని విశ్లేషకులు అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రజల్లో కొత్త ఆశలు నింపే ఈ నిర్ణయం అభివృద్ధి కార్యక్రమాలకు ఊతమివ్వనుంది. ముఖ్యంగా మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ అవకాశాల పెంపు వంటి అంశాల్లో వేగం పెరుగుతుందని భావిస్తున్నారు.
అమరావతి రాజధానిగా స్థిరపడితే పరిపాలనలో స్పష్టత వస్తుంది. రాష్ట్ర ప్రజల దీర్ఘకాల ఆశలు నెరవేరినట్లవుతుంది. మొత్తం మీద ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కీలక దిశానిర్దేశం చేసే ఘట్టంగా నిలవనుంది.