Nellore: కమిషనర్ స్వయంగా రంగంలోకి.. పన్ను బకాయిదారుల గుండెల్లో రైళ్లు!
Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేశారు.
Nellore: కమిషనర్ స్వయంగా రంగంలోకి.. పన్ను బకాయిదారుల గుండెల్లో రైళ్లు!
Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు...స్థానిక స్టోన్ హోస్ పేట, రేబాల వారి వీధి, సుబేదార్ పేట, ఏ.సి సెంటర్, సంతపేట సెంటర్ ప్రాంతాలలో... మొండి బకాయిదారుల వద్దకు శనివారం స్వయంగా వెళ్లి ఆస్థిపన్ను వసూళ్ల కార్యక్రమాన్ని చేపట్టారు.
కందప్ప మేస్త్రీ సత్రం, సుబేదార్ పేట, ఆర్.కె.టి పెట్రోల్ స్టేషన్ సమీపంలోని విజయ లాడ్జి, స్టోన్ హోస్ పేట, రేబాల వారి వీధి ప్రాంతాలలోని వివిధ దుకాణాలకు సంభందించి నెల్లూరు నగర పాలక సంస్థకు గత కొంతకాలంగా చెల్లించని బకాయిలను, తప్పనిసరిగా నిర్దేశించిన సమయం లోపు చెల్లించాలని యజమానులకు కమిషనర్ తెలియజేశారు.
ఈ ఆర్థిక సంవత్సరం ముగింపుకు కేవలం 4 రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 50 శాతం వడ్డీ రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బకాయి దారులకు కమిషనర్ సూచించారు. సెలవు దినాల్లో కూడా పన్నులు చెల్లించేందుకు ప్రత్యేక కౌంటర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇప్పుడు బకాయిలు చెల్లించే వారికి ఆస్తి పన్ను వడ్డీ మాఫీ చేయబడుతుందని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ అన్నారు.
నగరవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులకు పన్నుల వసూళ్ళే ఆధారమని, నిర్దేశించిన సమయానికి పన్నులను బాధ్యతగా చెల్లించి నగరపాలక సంస్థకు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారులు సమద్, శ్రీనివాసులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృపాకర్, వంశీనాథ్ రెడ్డి, సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు.