Nellore: నెల్లూరులో కాలువ పనుల పరిశీలన.. పేదలకు అండగా ప్రభుత్వం!

Nellore: నెల్లూరులో కాలువ ఆధునీకరణ పనులను డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పరిశీలించారు.

Update: 2026-03-28 04:46 GMT

Nellore: నెల్లూరులో కాలువ పనుల పరిశీలన.. పేదలకు అండగా ప్రభుత్వం!

Nellore: రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు, నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్ RSR స్కూల్ దగ్గర నుండి, హిమాలయ స్కూల్ వరకు జరుగుతున్న కాలువ ఆధునికరణ పనులను పరిశీలించారు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్.

ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులతో, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బిజెపి పార్టీ, స్థానిక నాయకులతో కలిసి కాలువ ఆధునీకరణ పనులను పరిశీలించడం జరిగిందన్నారు. ఎక్కడా చిన్నపాటి ఇబ్బంది జరగకుండా, ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదని మంత్రి నారాయణ గారు ఆలోచన చేస్తున్నారో.. అందులో భాగంగానే ఇక్కడ స్థానికంగా గతంలో నివసిస్తున్న వారందరికీ ఇక్కడే కాలువ పనులు పూర్తి అయిన తర్వాత, వారందరికీ ఇక్కడే స్థలాలివ్వడం జరుగుతుందన్నారు.

అటు ప్రతిపక్ష పార్టీలు పనిగట్టుకుని దుష్ప్రచారాలు చేయడం మంచిపద్దతి కాదన్నారు. వారందరిని ఇక్కడకు వచ్చి ఒకసారి చూడమని చెబుతున్నానన్నారు. అభివృద్ధి పనులు జరిగేటప్పుడు అక్కడక్కడ చిన్నపాటి ఇబ్బందులు ఉండడం సహజమన్నారు. పేదవారికి ఎలాంటి ఇబ్బందులు కూడా రాకుండా ఎలా పరిష్కరించాలని దానిమీద కూడా మంత్రి నారాయణ గారు ప్రత్యేక దృష్టి సారించి పనిచేయడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ రావు, జనరల్ సెక్రటరీ అనుదీప్, కార్యదర్శి సుబ్బారావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఉమామహేశ్వరి, 10 వ డివిజన్ క్లస్టర్ ఇంచార్జ్ తిరుమల నాయుడు, పొడమేకల సురేష్, బీజేపీ నాయకులు శ్రీనివాసులు, జనసేన నాయకులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News