Chittoor: తీర్థయాత్రలో విషాదం తిరుమల వెళ్తుండగా మృత్యువు కాటు!
Chittoor: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కారు ఢీకొన్నడి ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
Chittoor: తీర్థయాత్రలో విషాదం తిరుమల వెళ్తుండగా మృత్యువు కాటు!
Chittoor: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బంగారుపాళ్యం మండలం శేషాపురం దగ్గర ఆగిఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా.. కారు డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రోడ్డుపై ఆగిఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి అతివేగంగా ఢీకొట్టి.. బస్సు కిందికి దూసుకెళ్లింది కారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలుస్తోంది. మృతుల స్వస్థలం వరంగల్ కాగా.. బెంగళూరు నుంచి తిరుమలకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం.. చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.