Nellore: రైతు కడుపు కొట్టి.. దళారులకు దారి మళ్లింపు!
Nellore: నెల్లూరు జిల్లా జలదంకి మండలం బ్రాహ్మణకాకలో గన్ని బ్యాగుల అక్రమ తరలింపు కలకలం రేపింది.
Nellore: రైతు కడుపు కొట్టి.. దళారులకు దారి మళ్లింపు!
Nellore: ఆరుగాలం కష్టపడి దాన్యం పండించిన అన్నదాతలకు అడుగడుగునా అగచాట్లు తప్పడం లేదు. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన ధాన్యాన్ని, కొనుగోలు కేంద్రాల నిర్వహకులు దారి మళ్లించి దోపిడీకి పాల్పడుతున్నారు. గిట్టుబాటు ధర లేకుండా రైతులను దగా చేస్తున్నారు. మధ్య దళారులతో కలిసి నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. ధాన్యం పండించే సమయం కన్నా వాటిని విక్రయించే కాలంలో ఎదురవుతున్న ఇబ్బందులు అన్నదాతలను మరింత ఆవేదనకు గురిచేస్తున్నాయి.నెల్లూరు జిల్లా జలదంకి మండలంలో తాజాగా వెలుగు చూసిన ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకుడి దోపిడీ ఇందుకు తార్కాణంగా ఉంది. రైతులకు అందించాల్సిన గన్ని బ్యాగులను మధ్య దళారులతో కలిసి అర్ధరాత్రి వేళ తరలిస్తున్న వ్యవహారం జలదంకి మండలం బ్రాహ్మణకాక లో బట్టబయలైంది. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహికుడి పై రైతులు తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. తమ దైన్య పరిస్థితిపై ఆవేదన చెందుతున్నారు.
ఒకవైపు ధాన్యం విక్రయాల సమయంలో, రైతులకు అండగా నిలవాలని భావించిన ప్రభుత్వం ప్రత్యేక కొనుగోళ్ళ కేంద్రాలను.. అందుకు అవసరమైన గన్ని బ్యాగులను సరఫరా చేస్తోంది. దీనినే కొందరు కొనుగోలు కేంద్రాల నిర్వహకులు.. తమ ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు. జిల్లాలోని జలదంకి మండలం బ్రాహ్మణకాక లో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రైతులకు రాజమార్గాన్ని అందించాల్సిన గన్ని బ్యాగులను అర్ధరాత్రి వేళ మధ్య దళారులకు అప్పగిస్తున్న వైనాన్ని స్థానికులు బహిర్గతం చేశారు. కొనుగోలు కేంద్రంలోని గన్ని బ్యాగులను ఆటో ద్వారా తరలిస్తూ కెమెరాలకు చిక్కారు. దీనిపై రైతులు తీవ్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గన్ని బ్యాగులను అక్రమ మార్గంలో మధ్య దళారులకు అప్పగిస్తున్న కొనుగోలు కేంద్ర నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.