Nellore: పొదలకూరులో రంగస్థల వేడుకలు.. కళాకారులకు జేజేలు!
Nellore: నెల్లూరు జిల్లా పొదలకూరులో ప్రపంచ రంగస్థల కళాకారుల దినోత్సవం ఘనంగా జరిగింది.
Nellore: పొదలకూరులో రంగస్థల వేడుకలు.. కళాకారులకు జేజేలు!
Nellore: సందర్భంగా శుక్రవారం స్థానిక అంబేద్కర్ భవనంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాటక రంగానికి సేవలందించిన గురువులను, ప్రముఖ కళాకారులను సన్మానిస్తూ కళాభిమానులు వారికి గౌరవాభివందనం తెలిపారు.నాటక రంగానికి విశేషంగా సేవలందించిన తిరుపాల్ రెడ్డి, అబ్దుల్ అస్లాం, నెల్లూరు శ్రీనివాసులు, బొడ్డు.సంజీవరావు, కోలాటం గురువు రమణమ్మ, భజన గురువులు పెంచలయ్య, వరయ్య తదితరులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి పౌరాణిక కళాకారుడు కొత్తలూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ, “పొదలకూరు నాటక రంగానికి నిలయంగా నిలిచిన గ్రామమన్నారు. ఇక్కడి నుంచి ఎదిగిన కళాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చాటుకొని పేరు ప్రఖ్యాతలు గడించారు” అని తెలిపారు.
అలాగే బాల సరస్వతి నాట్యమండలి, అభ్యుదయ కళా సమితి వంటి సంస్థలు పొదలకూరులోనే ఆవిర్భవించాయని గుర్తుచేశారు. “ప్రపంచమే ఒక రంగస్థలం అయినప్పటికీ, పూర్వకాల కళాకారులు వేదికపైనే నటించేవారు, నిజజీవితంలో సహజత్వాన్ని పాటించేవారు” అని అన్నారు.కళాకారులు భౌతికంగా లేకపోయినా, వారి కళ మాత్రం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. 1961 సంవత్సరం నుంచి ప్రపంచ రంగస్థల కళాకారుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన బొడ్డు గురుస్వామి, డాన్సర్ పెంచల రామ్ లను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు చింతకింద పెంచలయ్య, బోడోలు పెంచలయ్య,లక్ష్మయ్య తో పాటు పలువురు రంగస్థల నటులు, కళాభిమానులు పాల్గొన్నారు.