Kukkunur: భక్తిశ్రద్ధలతో రామయ్య పెళ్లి వేడుక.. అన్నదాన కార్యక్రమం

Kukkunur: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం పెదరాయిగూడెంలో యూత్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి.

Update: 2026-03-27 13:29 GMT

Kukkunur: భక్తిశ్రద్ధలతో రామయ్య పెళ్లి వేడుక.. అన్నదాన కార్యక్రమం

Kukkunur: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని పెదరాయిగూడెం గ్రామంలోని ఆలయ కమిటీ, పెదరాయిగూడెం యూత్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రామాలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అర్చకుల వేద మంత్రోచ్చరణల మధ్య నిర్వహించారు.

స్వామివారి కల్యాణానికి వందలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:    

Similar News