Veeraghattam: చెత్త నుండి సంపద సృష్టించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

Veeraghattam: వీరఘట్టం మండలంలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పారిశుధ్య కార్మికులకు పుష్ కార్ట్‌లు, స్వచ్ఛ రథం వాహనాలను పంపిణీ చేశారు.

Update: 2026-03-27 12:28 GMT

Veeraghattam: చెత్త నుండి సంపద సృష్టించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

Veeraghattam: వీరఘట్టం మండల పరిషత్ స్వర్ణాంద్ర స్వచ్చాంద్ర కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులకు చెత్తను తరలించే పుష్ కార్ట్ ,స్వచ్ఛ రధం వాహనాల పంపిణి కార్యక్రమంలో *ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గారు* పాల్గొన్నారు అనంతరం పారిశుధ్య కార్మికుల పుష్ కార్ట్ లు మరియు ట్రై సైకిల్ లను పచ్చ జెండా ఊపి ఆయన ప్రారంభించారు.

గ్రామస్థాయి నుండి స్వచ్ఛతను పాటిస్తే దేశం స్వచ్ఛంగా ఉంటుందని ఎమ్మెల్యే జయకృష్ణ అన్నారు. ప్రజలు కూడా స్వచ్ఛ భారత్ లో భాగం కావాలని, తమ ఇళ్లల్లోని చెత్తను రోడ్లపై పడేయకుండా తడి చెత్తను, పొడి చెత్తను విడివిడిగా పారిశుధ్య కార్మికులకు అందించాలని ఆయన కోరారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారని ఆ స్ఫూర్తితో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ఉద్యమంలో భాగం అయ్యిందని దానిలో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వచ్చాంధ్ర కార్యక్రమం చేపడుతున్నారని దానికి ప్రజల సహకారం ఎంతో అవసరం అని అన్నారు.

కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిచేందుకు నడుము బిగించిందని అందులో చెత్తనుండి కూడా సంపద సృష్టి అనే ఆలోచనతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల చెత్తనుండి సంపద సృష్టించే కేంద్రాలను ఏర్పాటు చేసిందని అన్నారు.

భవిష్యత్తులో స్వచ్ఛతకు ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రోల్ మోడల్ గా నడుస్తుందని ఎమ్మెల్యే జయకృష్ణ ఆశాభావం వ్యక్తం చేసారు.

Tags:    

Similar News