Araku: కోవూరు అభివృద్ధికి అరకు ఎంపీ భారీ కేటాయింపు

Araku: అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజా రాణి కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి రూ. 10 లక్షల ఎంపీ నిధులు కేటాయించారు.

Update: 2026-03-27 13:48 GMT

Araku: కోవూరు అభివృద్ధికి అరకు ఎంపీ భారీ కేటాయింపు

Araku: వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకు పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్. గుమ్మా తనూజా రాణి తన MP నిధులనుండి రూ. 10 లక్షల రూపాయలతో కోవూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కొరకు ఉత్తర్వులు ఇవ్వడంతో. నేడు మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నార్తురాజుపాలెం, చౌకచర్ల, దంపూరు గ్రామాల వైసీపీ నాయకులకు ఆ పత్రాలను అందజేశారు.

వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డాక్టర్. గుమ్మా తనూజా రాణి అడిగినవెంటనే స్పందించి తన MP నిధులనుండి రూ. 10 లక్షల రూపాయలతో కోవూరు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

కొడవలూరు మండలం నార్తు రాజుపాలెం గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి. రూ.5 లక్షలు, విడవలూరు మండలం చౌకచర్ల గ్రామ ST కాలనీలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి రూ.3 లక్షలు, విడవలూరు మండలం లోని దంపూరు గ్రామ SC కాలనీలో సైడ్ డ్రైన్ నిర్మాణానికి రూ.2 లక్షలు. అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజ రాణి కి ధన్యవాదాలు తెలిపారు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. అధికారం శాశ్వతం కాదని, ప్రజల పక్షాన నిలబడి పనిచేయేడమే తమ లక్ష్యమని చెప్పారు ప్రసన్న కుమార్ రెడ్డి.

Tags:    

Similar News