Sriramagiri: గోదావరి దాటి 'యోగరాముడి' చెంతకు.. భక్తుల కోలాహలం!

Sriramagiri: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల భక్తులు గోదావరి నది దాటి శ్రీరామగిరి కొండపై ఉన్న కోదండరామ స్వామిని దర్శించుకున్నారు.

Update: 2026-03-27 09:43 GMT

Sriramagiri: గోదావరి దాటి 'యోగరాముడి' చెంతకు.. భక్తుల కోలాహలం!

Sriramagiri: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని ఎర్రబోరు, శివకాశీపురం, భూదేవిపేట గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం వైభవంగా జరిగాయి. ప్రతి యేటా భక్తులు భారీ సంఖ్యలో తాట్కూరుగొమ్ము చేరుకుని, అక్కడి నుంచి గోదావరి నదిపై లాంచీల ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లా వీఆర్ పురం మండలంలో చింతూరు వద్ద గోదావరి నది ఒడ్డున శ్రీరామగిరిి కొండపై ఉన్న కోదండరాం స్వామివారి ఆలయానికి వీ.ఆర్ పురం, చింతూరు మండలాలతో పాటుగా వేలేరుపాడు మండల పరిధిలోని గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు కోదండ రామస్వామిని దర్శించుకునేందుకు వెళుతూ ఉంటారు.

ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన శ్రీరామగిరి కొండపై రామదాసుకి శ్రీరాముడు యోగరాముడిగా దర్శనమిచ్చిన ప్రదేశంగా, కొండపై రాముడు, సీత, లక్ష్మణుల స్వయంభూ విగ్రహాలు ఉన్న పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి. శ్రీరామగిరి కొండపై వెలసిన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని భక్తులు కనులారా వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సీతారాముల దర్శనంతో జన్మ ధన్యమైంది భక్తులు చెబుతున్నారు.

Tags:    

Similar News