Nellore: హనుమాన్ ఆలయంలో మంత్రి నారాయణ దంపతుల పూజలు.. విమర్శకులపై ఫైర్!

Nellore: నెల్లూరులో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి నారాయణ. నెల్లూరును విద్యా, వైద్య రంగాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతామని స్పష్టం చేశారు.

Update: 2026-03-27 07:44 GMT

Nellore: హనుమాన్ ఆలయంలో మంత్రి నారాయణ దంపతుల పూజలు.. విమర్శకులపై ఫైర్!

Nellore: 43 వ డివిజన్ బొందిల వీధిలోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పొంగూరు నారాయణ. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి నారాయణ దంపతులు. హనుమాన్ మందిర్ ట్రస్ట్ సభ్యులు ఘన స్వాగతం పలికి, దంపతులను ఆహ్వానించారు.

రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి దంపతులు. జిల్లా ప్రజలు, అలాగే రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని దేవుని వేడుకున్నట్లు చెప్పారు. శ్రీరామనవమి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న హనుమాన్ మందిర్ ట్రస్ట్ సభ్యులకు , సేవకులకు అభినందనలు తెలియజేశారు మంత్రి దంపతులు.

సీతారాముల ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని . ప్రతి ఇంటిలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నెలకొనాలని, ఆకాంక్షించారు మంత్రి దంపతులు. ఇప్పటికే అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న నెల్లూరు నగరాన్ని మరింత శోభాయమానంగా , తీర్చిదిద్దుతామని, ఇప్పటికే కొనసాగుతున్న పార్కులో పండుగతో నెల్లూరు నగరం అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంటుందని.

తాను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్ని ఓర్చుకోలేని కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, కానీ తాను అవేమీ పట్టించుకోనని చెప్పారు మంత్రి నారాయణ. విద్య వైద్యం పారిశుధ్య రంగాల్లో. రాష్ట్రంలోనే మన నెల్లూరు మొదటి స్థానం వచ్చే విధంగా, అడుగులు వేస్తున్నామని. తన లక్ష్యం కూడా అదేనని చెప్పారు మంత్రి నారాయణ. రాబోయే కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో జిల్లా ప్రజల తీర్చుకుంటామని చెప్పారు మంత్రి నారాయణ.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువ నేత విద్యా శాఖ మంత్రి లోకేష్ బాబుల నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని వారి దిశా నిర్దేశంలోనే, నెల్లూరు జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపగలననే నమ్మకం తనకుందని చెప్పారు మంత్రి నారాయణ.

Tags:    

Similar News