Nellore: బ్రిడ్జిపై నుంచి వాగులోకి.. ట్రాక్టర్ డ్రైవర్ మృతి!
Nellore: నెల్లూరు–ముంబై జాతీయ రహదారి మర్రిపాడు మండలం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Nellore: బ్రిడ్జిపై నుంచి వాగులోకి.. ట్రాక్టర్ డ్రైవర్ మృతి!
Nellore: నెల్లూరు–ముంబై జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మర్రిపాడు మండలం, కదిరి నాయుడు పల్లి బ్రిడ్జిపై నుంచి అదుపుతప్పిన ట్రాక్టర్ వాగులో పడిపోవడంతో.. ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కావలి నుంచి అనంతపురం వైపు ఫెన్సింగ్ స్తంభాలతో వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో.
సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ వేణుగోపాల్, సీఐ గంగాధర్, ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. రోడ్డు రవాణా సంస్థ అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, వ్యక్తిగత జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా పాటించాలి అన్నారు డిఎస్పి వేణుగోపాల్... వేగం కన్నా ప్రాణం మిన్న అని, మనం ప్రయాణించేటప్పుడు మన కోసం.. మన వెనుక ఒక కుటుంబం ఉందన్న విషయాన్ని , ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని సూచించారు.