Kukkunur: నర్సరీల నీటి కోసం భూగర్భ జలాలకు గండి.. చర్యలు శూన్యం!
Kukkunur: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో అనుమతి లేకుండా జరుగుతున్న అక్రమ బోర్ల తవ్వకాలపై అధికారులు స్పందించడం లేదు.
Kukkunur: నర్సరీల నీటి కోసం భూగర్భ జలాలకు గండి.. చర్యలు శూన్యం!
Kukkunur: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో అనుమతి లేకుండా ఇష్టారీతిన బోర్ల తవ్వకాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. మండల పరిధిలోని బంజరగూడెం, తొండిపాక, ఇబ్రహీంపేట,మిట్టగూడెం, గణపవరం, గుంపెనపల్లి, బోనగిరి, అల్లిగూడెం, పెదరాయిగూడెం, వెంకటాపురం, వేలేరు గ్రామల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూముల్లో పగలు రాత్రి అనే తేడా లేకుండా అక్రమంగా బోర్లు తవ్వకాలు జరుగుతున్నప్పటికీ స్థానిక అధికారులు స్పందించకపోవడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఒకప్పుడు పంట పొలాకు పరిమితమైన బోర్లు ఇప్పుడు జామయిల్, జామ క్లోన్ నర్సరీలో నీటి వినియోగ అధికమవడంతో నర్సరీలో నీటి వినియోగం నిమిత్తం వేస్తున్న బోర్ల తవ్వకాలు ఎక్కువ అవుతున్నాయి. బోరు తవ్వాలంటే సంబంధిత మండలాల తహసీల్దార్ల వద్ద అనుమతి తీసుకోవాల్సి ఉన్నప్పటికి నిబంధనలను ఎవరు పాటించకపోవడం ఒకింతైతే నీరు,చెట్టు, భూమి పరిరక్షణ నిమిత్తం ఏర్పాటు చేసిన వాల్టా చట్టాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో అమలు చేయకపోవడం మరోఎత్తు.
ప్రభుత్వ భూముల్లో బోర్ల తవ్వకాలు జరుపుతుంటే రెవెన్యూ అధికారులు మాత్రం వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కేవలం హెచ్చరికలు మాత్రమే జారీ చేస్తున్నారని, చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని పలువురు బాహాటంగానే చెబుతున్నారు. విచ్చలవిడి బోరు బావులు తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో భవిష్యత్ తరాలకు నీటి కరువు వచ్చే ప్రమాదం ఉన్నందున ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విచ్చలవిడిగా జరుపుతున్న బోరు బావుల తవ్వకాలు నిలిపివేసి, అనుమతి లేకుండా అక్రమ బోర్ల తవ్వకాలు జరుపుతున్న రిగ్గులను సీజ్ చేసి భావితరాలకు నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు కోరుతున్నారు.