Raghu Rama Krishna Raju: డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పై దాడికి యత్నం!
Attack on Raghu Rama Krishna Raju: పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పర్యటన రణరంగంగా మారింది.
Akividu: డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పై దాడికి యత్నం!
Attack On Dy Speaker Raghurama Convoy: పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ఉద్రిక్తత ఏర్పడింది. పెదపేటలోని రామాలయాన్ని సందర్శించడానికి వెళ్ళారు డిప్యూటీ స్పీకర్ రఘరామకృష్ణరాజు. రామాలయానికి వెళ్ళకుండా రఘురామకృష్ణమరాజును అడ్డుకుని దాడికి యత్నించారు దళితుల ముసుగులో ఉన్న క్రిస్టియన్లు. అప్రమత్తమైన పోలీసులు మోహరించి రఘురామకృష్ణరాజును క్షేమంగా బయటకు తీసుకుని వచ్చారు.
అదే సమయంలో దాడి చేస్తున్న కొందరిని అక్కడ ఉన్న కూటమి నాయకులు అడ్డుకున్నారు. కూటమి నాయకులపై మేకులు, కర్రలు , రాడ్లతో దాడి చేసారు దుండగులు. కూటమి నాయకులు పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించారు. ఆకివీడు పెదపేటలో శిధిలమైన రామాలయాన్ని పునర్నిర్మిస్తామని రఘురామకృష్ణరాజు అన్నారు. ఆ స్థలంలో నందమ్మ గుడి ఉండేదని కొందరు ఆందోళన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్రిక్తత ఏర్పడింది.