Nellore: శబరి శ్రీరామ క్షేత్రంలో వైభవంగా సీతారాముల కళ్యాణం!

Nellore: నెల్లూరు జిల్లావ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. శబరి శ్రీరామ క్షేత్రంలో జరిగిన సీతారాముల కళ్యాణంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు.

Update: 2026-03-27 09:01 GMT

Nellore: శబరి శ్రీరామ క్షేత్రంలో వైభవంగా సీతారాముల కళ్యాణం!

Nellore: ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని హనుమాన్, శ్రీరాముని ఆలయాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. నెల్లూరు నగరంలోని శబరి శ్రీరామ క్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి..సీతారాముల కళ్యాణం ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 37వ డివిజన్ రామ్ నగర్ నందు శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా శబరి శ్రీరామ క్షేత్రంలో శ్రీ సీతరాముల వారి కళ్యాణం మహోత్సవంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో నవమి వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు. గ్రామ గ్రామాన నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పల్లె, పట్టణం, నగరం అన్న తేడా లేకుండా రాములోరి ఉత్సవాలను కనువిందుగా నిర్వహిస్తూ ఉన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ ఉన్నారు.

నెల్లూరు నగరంలోని శబరి శ్రీరామ క్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమాలను కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రాములోరి ఆలయాలు భక్త జనసంద్రంతో నిండిపోయాయి. ప్రత్యేక పూజలంకరణలతో శ్రీరాములు వారు. దేదీప్యమానంగా వెలుగొందుతున్నారు.

శ్రీరామనవమి సందర్భంగా శబరి శ్రీరామ క్షేత్రం సమీపంలో రాములోరి కళ్యాణ ఉత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా శబరి శ్రీరామ క్షేత్రం సమీపంలో రాములోరి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పారు ఆలయ ప్రధాన అర్చకులు సత్య స్వామి.

Tags:    

Similar News