Vijayawada: మత సామరస్యానికి ప్రతీక రామయ్య పెళ్లి వేడుకలో షేక్ ఇంతియాజ్!
Vijayawada: అద్దాల సాయిబాబా మందిరంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణంలో మదీనా వాచ్ అధినేత షేక్ ఇంతియాజ్ పాల్గొన్నారు.
Vijayawada: మత సామరస్యానికి ప్రతీక రామయ్య పెళ్లి వేడుకలో షేక్ ఇంతియాజ్!
Vijayawada: మత సామరస్యానికి ప్రతీకగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు మదీనా వాచ్ అధినేత షేక్ ఇంతియాజ్. అద్దాల సాయిబాబా మందిరంలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్నారు టీడీపీ నాయకులు మదీనా వాచ్ అధినేత షేక్ ఇంతియాజ.
టీడీపీ నాయకులు, మదీనా వాచ్ గ్రూప్ చైర్మన్ షేక్ ఇంతియాజ్ ఈరోజు అద్దాల సాయిబాబా మందిరంలో అత్యంత వైభవంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో. ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ పవిత్రమైన కళ్యాణ ఘట్టానికి అవసరమైన పట్టు పంచ, టవల్స్, చీర, గాజులు, మరియు టెంకాయ తదితర కళ్యాణ వస్తువులను ఆయన స్వయంగా సమర్పించి తన భక్తిని, ఉదారతను చాటుకున్నారు.
ఈ సందర్భంగా షేక్ ఇంతియాజ్ మాట్లాడుతూ. "కులమతాలకు అతీతంగా సమాజంలో ప్రజలందరూ సోదరభావంతో, ఐకమత్యంగా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని, పండుగలు, దైవకార్యాలు మనమందరం ఒకే కుటుంబం అనే భావనను పెంపొందిస్తాయని చెప్పారు.. హిందూ, ముస్లిం అనే బేధం లేకుండా ఇలాంటి పవిత్ర కార్యక్రమాల్లో అందరం కలిసిమెలిసి పాల్గొనడం మన గొప్ప సంస్కృతికి, మతసామరస్యానికి ప్రతీక," అని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలు, నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, సమాజంలో శాంతి, ఆనందం వెల్లివిరియాలని సీతారాములను మనసారా ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. అలాగే, తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అన్ని వర్గాల, అన్ని మతాల ప్రజల అభ్యున్నతి కోసం, సర్వమత సమ్మేళనమే లక్ష్యంగా కృషి చేస్తుందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.