Nellore: రూరల్ ప్రభుత్వ స్కూళ్లకు కార్పొరేట్ కళ

Nellore: నెల్లూరు రూరల్ ప్రభుత్వ బాలికల హైస్కూల్‌ను మంత్రి నారాయణ సందర్శించారు. రూ. 5 కోట్లతో స్కూల్‌ను ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు.

Update: 2026-03-27 13:13 GMT

Nellore: రూరల్ ప్రభుత్వ స్కూళ్లకు కార్పొరేట్ కళ

Nellore: రూరల్ లోని ప్రభుత్వ హైస్కూల్స్ అభివృద్ధిపై దృష్టి సారించారు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ. పొదలకూరు రోడ్డులోని ప్రభుత్వ బాలికల హైస్కూల్ ని పరిశీలించారు మంత్రి నారాయణ. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ,రూరల్ టీడీపీ నేతలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. పాఠశాలకు అవసరమైన తరగతి గదులు ,సౌకర్యాలపై ఆరా తీసిన మంత్రి , విఆర్సీ తరహాలో అంతర్జాతీయ స్థాయిలో సిద్ధం చేస్తానని హామీ ఇచ్చారు.

సిటీ తరహాలో రూరల్ ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తానని మాటిచ్చారు.యువనేత లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా వీఆర్సీనీ సిద్ధం చేశామని, సిటీలో అదే తరహాలో మరో పద్నాలుగు స్కూల్స్ సిద్దమౌతున్నాయని చెప్పారు. రూరల్ లోని ప్రభుత్వ బాలికల హైస్కూల్ ని 5 కోట్లతో ఆధునీకరిస్తున్నామని తెలిపారు. సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధికి ముందుకొచ్చిన ఏ ఎం ఆర్ కనస్ట్రక్షన్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు మంత్రి నారాయణ.

ఏప్రిల్ 15 తర్వాత పనులు ప్రారంభిస్తామని, కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ హైస్కూల్స్ అన్నింటినీ మూడేళ్ళలో ఆధునీకరిస్తామని చెప్పారు. నారాయణ విద్యాసంస్థల తరపున సిటీ ,రూరల్ లోని పేదవిద్యార్థులకు సైకిళ్ళు పంపిణి చేస్తున్నట్లు చెప్పారు.

త్వరలోనే విద్యాశాఖమంత్రి లోకేష్ చేతుల మీద అందచేస్తామని తెలియజేశారు. రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ. రాజధాని నిర్మాణంలో బిజీ గా ఉన్నా, నియోజక వర్గంలో అభివృద్ధిని పరుగు పెట్టిస్తున్నారని చెప్పారు.

పార్కులను అభివృద్ధి ఓవైపు, ప్రభుత్వ స్కూల్స్ రూపురేఖలు మారుస్తున్నారని చెప్పారు. సిటీ ని రోల్ మోడల్ గా నిలిపేందుకు శ్రమిస్తున్నారని, అదే తరహాలో రూరల్ లో కూడా అభివృద్ధికి సహకరిస్తానని మంత్రి నారాయణ మాటిచ్చారని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం రూరల్ లో స్కూల్స్ అభివృద్ధిపై దృష్టిపెట్టారని సంతోషం వ్యక్తం చేశారు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. రూరల్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైకిళ్లు కూడా పంపిణి చేయనున్నారని చెప్పారు.

ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ ,జిల్లా విద్యాశాఖాధికారి బాలాజీరావు ,మేయర్ సుజాత అశోక్ ,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ,టీడీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు విజేతా రెడ్డి ,నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ,టీడీపీ పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కపిర రేవతి ,రూరల్ టీడీపీ నేతలు పాల్గొన్నారు .

Tags:    

Similar News