Eluru: కాకిసనూరు గిరిజనుల ‘పడవ’ కష్టాలు.. పట్టించుకోని ఐటీడీఏ!
Eluru: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కాకిసనూరు గ్రామంలో రవాణా కష్టాలు వర్ణనాతీతం.
Eluru: కాకిసనూరు గిరిజనుల ‘పడవ’ కష్టాలు.. పట్టించుకోని ఐటీడీఏ!
ఏలూరు జిల్లా: వేలేరుపాడు మండలం కాకిసనూరు గ్రామంలో 100 కుటుంబాలు పైనే నివసిస్తున్నాయి.ఈ గ్రామానికి ఒకవైపు గోదావరి మిగిలిన మూడు వైపులు ప్రజరు ఫారెస్ట్ ఉండటంతో ఆ గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో పడవ పైనే ప్రయాణం సాగించాల్సి ఉంది. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్న సమయంలో భద్రాచలం ఐటీడీఏ ద్వారా గ్రామా నికి బోటు సౌకర్యం కల్పించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మండలం విలీనం తరువాత కాకిసునూరు బోటును ఎవరూ పట్టించుకోకపోవడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరింది.
కేఆరప్పురం ఐటీడీఏ ద్వారా ఇప్పటి వరకు బోటుకు మరమ్మత్తులు చేపట్టలేదని, ఐటీడీఏ ద్వారా ఎలాంటి పథకాలు తమకు అందలేదని కొండరెడ్డి తెగకు చెందిన గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. ఏళ్లుగా ముంపు పేరు చెబుతూ పడవ మరమ్మతులు గాలికి వదిలేశారని, ఎన్నికల సమయంలో కాకిసనూరు గ్రామంలో పోలింగ్ నిర్వహించేందుకు వస్తున్న అధికారులకు బోటు ఏర్పాటు చేస్తూ ఓట్లు పొందుతున్నారు తప్ప శాశ్వత పరిష్కారం కింద నూతన పడవను ఏర్పాటు చేయట్లేదు. దీంతో ప్రయాణాలు సాగించేందుకు ప్రైవేటు పడవలే దిక్కయ్యాయని భాధిత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మా గ్రామ ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఐటీడీఏ ద్వారా నూతన బోటు సౌకర్యం కల్పించాలని ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు.