Nellore: మాట ఇస్తే మడమ తిప్పని కోటంరెడ్డి.. రూ. 614 కోట్లతో పనుల పండుగ

Nellore: నెల్లూరు రూరల్‌లో రూ. 614 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని బీద రవిచంద్ర తెలిపారు. 19వ డివిజన్ శ్రీహరి నగర్‌లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

Update: 2026-03-28 07:23 GMT

Nellore: మాట ఇస్తే మడమ తిప్పని కోటంరెడ్డి.. రూ. 614 కోట్లతో పనుల పండుగ

Nellore: నెల్లూరు రూరల్ లో 3వ విడత అభివృద్ధి జాతర మొదలైంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్, శ్రీహరి నగర్ లో, 55 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు శాసనమండలి సభ్యులు మరియు టీడీపీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, రాష్ట్ర ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ ఛైర్మెన్ జెడ్. శివప్రసాద్ మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడూ విభిన్నమైన ఆలోచనలతో కొత్త కార్యక్రమాలు చేపడుతుంటారని, శాసనమండలి సభ్యులు మరియు టీడీపీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, శాసనమండలి సభ్యులు మరియు టీడీపీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర చెప్పారు.

రాష్ట్రంలో ఏ శాసనసభ్యులు చేయని విధంగా అభివృద్ధి పనులకు ఎక్కువ నిధులు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి తీసుకువచ్చింది, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని అన్నారు జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 614 కోట్ల తో, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 19వ డివిజన్ అభివృద్ధికి 8 కోట్ల 50 లక్షల రూపాయల నిధులు కేటాయించామని తెలియజేశారు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

నెల్లూరు రూరల్ లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల వేగాన్ని సీనియర్ శాసనసభ్యులు కూడా అందుకోలేకున్నారని, రాష్ట్ర ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ ఛైర్మెన్ జెడ్. శివప్రసాద్ చెప్పారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మారంరెడ్డి జ్యోతి ప్రియా, క్లస్టర్ ఇంచార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, 19వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు బొప్పూరు ప్రసాద్, టిడిపి నాయకులు జానా శివయ్య, కాయల మధు, కోరెం ప్రవీణ్, లక్ష్మయ్య, జనసేన నాయకులు కాకు మురళి రెడ్డి, టిడిపి, జనసేన, బీజేపీ నాయకులు మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News