Nellore: ఆపదలో ఉన్నారా? ఒక్క క్లిక్ చేస్తే చాలు.. మీ వద్దకు పోలీసులు!

Nellore: నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 'శక్తి' యాప్‌పై పోలీసులు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.

Update: 2026-03-28 10:08 GMT

Nellore: ఆపదలో ఉన్నారా? ఒక్క క్లిక్ చేస్తే చాలు.. మీ వద్దకు పోలీసులు!

Nellore: నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో శక్తి యాప్ ఆవశ్యకత గురించి విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు నెల్లూరు పోలీసులు. మహిళల రక్షణ కవచం "శక్తి" యాప్ అని, రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం ఏర్పాటుచేసిన శక్తి యాప్ ప్రతి మహిళా తప్పక డౌన్లోడ్ చేసుకోవాలి అని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు...శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల, విపత్కర పరిస్థితులలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రక్షిస్తారని అవగాహన కల్పిస్తున్నారు.

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, అడిషనల్ యస్.పి.(అడ్మిన్) సూచనల మేరకు, శక్తి బృందాలుగా ఏర్పడిన పోలీసులు, జిల్లా వ్యాప్తంగా బస్టాండ్, రైల్వే స్టేషన్స్, దుకాణాలు, ఇతర ప్రదేశాలలో విస్తృతంగా ప్రజలకు, మహిళలకు, విద్యార్ధినులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

మహిళల రక్షణ కవచం శక్తి యాప్ అని, ప్రతి ఒక్క మహిళ, గృహిణులు, విద్యార్థినిలు, బాలికలు మొబైల్లో శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయంలో పోలీస్ వారి తక్షణపు సహాయం పొందాలని తెలిపారు.

మొబైల్ లో శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకునే విధానం, దాని ఉపయోగాలు, బాల్య వివాహాలు, బాల కార్మిక, వెట్టిచాకిరీ వ్యవస్థలు, మానవ అక్రమ రవాణా, ఫోక్సో యాక్ట్, మాదకద్రవ్యాల నిషేధం, డయల్ 100, 112, 1098, 1930 మొదలగు అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News