Ameerpet Metro Station: అమీర్‌పేట మెట్రో స్టేషన్ పై నుండి దూకి యువతి ఆత్మహత్యాయత్నం
Ameerpet Metro Station: ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం...
Ameerpet Metro Station: అమీర్‌పేట మెట్రో స్టేషన్ లో యువతి ఆత్మహత్యాయత్నం
Hyderabad: హైదరాబాద్ అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్ద శుక్రవారం యువతి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో అమీర్‌పేట మెట్రో స్టేషన్ రెండో అంతస్తు నుంచి హీనా (20) అనే యువతి కిందకు దూకి ఆత్మహత్యకు యత్నించింది. దీంతో అమీర్‌పేట మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న టింబర్ డిపోలో పడిపోయిన ఆమెని చూసిన మెట్రో సిబ్బంది వెంటనే అలెర్ట్ అయి దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు యువతి ప్రస్తుతం బీటెక్ చదువుతూ అమీర్‌పేటలోని ఒక హాస్టల్ లో ఉంటున్నట్లుగా గుర్తించారు. అయితే యువతి ఆత్మహత్యకి యత్నించడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.