Hyderabad: భర్త వీర్యం బదులు వేరొకరి వాడారు.. ఐవీఎఫ్ కేంద్రంపై మహిళ ఫిర్యాదు
Hyderabad: భర్త వీర్యం బదులు వేరొక వ్యక్తి వీర్యాన్ని వినియోగించారని ఆరోపణలతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సికింద్రాబాద్‌లోని ఓ ప్రముఖ టెస్ట్ ట్యూబ్ సెంటర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Hyderabad: భర్త వీర్యం బదులు వేరొకరి వాడారు.. ఐవీఎఫ్ కేంద్రంపై మహిళ ఫిర్యాదు
Hyderabad: సంతానం కోసం ఆశగా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను ఆశ్రయించిన ఓ దంపతులకు తీరని షాక్ ఎదురైంది. ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ప్రక్రియలో భర్త వీర్యం బదులు వేరొక వ్యక్తి వీర్యాన్ని వినియోగించారని ఆరోపణలతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సికింద్రాబాద్‌లోని ఓ ప్రముఖ టెస్ట్ ట్యూబ్ సెంటర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం, పిల్లల కోసం సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్న దంపతులు సంబంధిత సెంటర్‌ను ఆశ్రయించారు. ఐవీఎఫ్ విధానం ద్వారా గర్భవతిగా మారిన మహిళ ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆ శిశువు తరచూ అనారోగ్యంతో బాధపడుతుండటంతో వైద్య పరీక్షలు నిర్వహించగా, క్యాన్సర్ ఉన్నట్లు తేలింది.
దీనితో కుటుంబ సభ్యులకు కలవరమొచ్చింది. ఎందుకంటే ఇరు కుటుంబాల్లో క్యాన్సర్‌కు సంబంధించిన చరిత్ర లేదని వారు పేర్కొన్నారు. మరింత స్పష్టత కోసం టెస్ట్ ట్యూబ్ సెంటర్‌ను మరోసారి సంప్రదించగా, సిబ్బంది సందిగ్ధమైన సమాధానాలు ఇచ్చారు.
పోలీసుల సూచన మేరకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించగా, శిశువు జన్యుపరంగా బాధిత దంపతుల పిల్లవాడు కాదని స్పష్టమైంది. దీంతో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద వైద్య నిర్లక్ష్యం, మానవ తప్పిదం వంటి కోణాల్లో పోలీసులు విచారణ ప్రారంభించారు.
అసలు ఏ కారణాలతో ఈ తప్పిదం చోటుచేసుకుంది? బాధ్యత ఎవరిది? — అనే అంశాలపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని బాధితులు స్పష్టం చేస్తున్నారు.