Crime News: కోకాపేట్‌లో దారుణం.. కూరగాయల కత్తితో భర్తను హతమార్చిన భార్య
Crime News: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అగ్ని సాక్షిగా వేదమంత్రోత్సవాల మధ్య తాళికట్టిన భర్తనే హతమార్చింది ఓ భార్య.
Crime News: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అగ్ని సాక్షిగా వేదమంత్రోత్సవాల మధ్య తాళికట్టిన భర్తనే హతమార్చింది ఓ భార్య. గండిపేట మండలం కోకాపేటలో ఉంటూ జీవనం సాగిస్తున్న భారాకా బోరాతో అతని భార్య కృష్ణ జ్యోతి గొడవ పడింది. కొన్ని రోజులుగా భర్త వేధిస్తుండటంతో రెచ్చి పోయిన భార్య భర్తపై కత్తితో దాడి చేసింది.
భర్త కేకలు వేయడంతో ఇరురుగుపొరుగు వారు వచ్చే సరికి రక్తపు మడుగులో పడి ఉన్న భారాకా బోరాను ఆసుపత్రికి తరిలించారు. చికిత్స పొందుతూ మరణించాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు మృతుడి భార్యను అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.