Village Chicken Prices Rises: నాటుకోళ్లకు పెరిగిన ఫుల్ డిమాండ్

Update: 2020-07-22 09:30 GMT

Village Chicken Prices Rises : నాటు కోడి.. అనగానే మాంసపు ప్రియులకు నోరూరుతుంది. కానీ దాని ధర చూస్తేనే నోరేళ్లబెడుతున్నారు. కరోనా వైరస్ దేశంలో అడుగుపెట్టగానే నాటు కోడి ధరలకు రెక్కలచ్చాయి. ఎంత ధర అయినా పర్వాలేదన్న దొరికే పరిస్థితి లేదు. ఇక పట్నం ప్రజలకు నాటు కోడి అందని ద్రాక్షగా మారింది. అవి పల్లెలకు పరిమితమయ్యాయి. ఇంతకీ నాటు కోడికి అంతలా డిమాండ్ ఎందుకు వచ్చింది. కరోనా వైరస్ కు నాటుకోడి ధరలకు ఉన్నలింకెంటి.?

పల్లెల్లో సహజసిద్ధంగా పెరిగే నాటు కోడి అంటే ఎవరికైనా నోరూరుతుంది. నాటు కోడిలో పుష్కలంగా విటమిన్స్ ఉంటాయి. మన శరీరానికి కావాల్సినంత రోగ నిరోధక శక్తిని ఈ మాంసం ప్రసాదిస్తుంది. అందుకే చాలా మంది నాటుకోడి మాంసం తినడానికి ఇష్టపడతారు. ఇక వర్షాకాలం రాగానే నాటు కోడి డిమాండ్ రెట్టింపు అవుతుంది. సీజన్ వ్యాధులను తరిమికొట్టే లక్షణాలు నాటు కోడి మాంసంలో పుష్కలంగా ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే నాటు కోడి నాటు వైద్యంగా పని చేస్తుందన్నమాట.

అప్పటికే నాటుకోడికి ఫుల్ డిమాండ్.. పైగా వర్షా కాలం ఇక కరోనా మహమ్మారి మొత్తానికి నాటుకోడి నోరూరిస్తుందో తప్పా నోటికి అందడం లేదు. నాటు కోడికి ప్రత్యేకమైన ఫామ్స్ ఉన్నప్పటికీ పల్లెల్లో సహజసిద్ధంగా పెరిగిన నాటుకోళ్లకే ఫ్యాన్స్ ఎక్కువ. కరోనా విజృంభణ కొనసాగుతుండడంతో నగరాల నుంచి చాలా మంది తమ సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో పల్లెల్లోనే నాటు కోడికి ఫుల్ డిమాండ్ పెరిగింది. దీంతో నగరానికి సరఫరా చేసే అవకాశమే లేకుండా పోయింది.

మరోవైపు నాటు కోడి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందనే నమ్మకంతో చాలా మంది ఆ మాంసం తినేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో నగరం నుంచి పల్లెలకు వెళ్లిన వారంతా నాటు కోడిని పట్టుకునే పనిలోపడ్డారు. దీంతో నాటుకోడికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దానికి అనుగూణంగానే రేటు రెట్టింపు అయ్యింది. ఒకప్పుడు కేజీ ధర 250 ఉంటూ ఇప్పుడు 5వందలు దాటింది. ఇన్ని పరిణామాల నేపథ్యంలో నాటుకోడి పట్నం వరకు చేరకునే అవకాశమే లేకుండా పోయింది. దీంతో నగరవాసులకు నాటు కోడి కనిపించడమే గగనమైపోయింది. డబ్బులు ఎత్తైన పర్వాలేదని చెప్పినా వ్యాపారులు దొరకడం లేదని చెబుతున్నారు. దీంతో మాంసపుప్రియులు నిరాశగా వెనుతిరుగుతున్నారు.

Tags:    

Similar News