నిండు గర్భిణీకి ఎమ్మెల్యే చికిత్స..

ఒక నియోజక వర్గాన్ని పాలించే ఓ ఎమ్మెల్యే నిండుగర్భిణీకి వైద్యం అందించారు. ఏదైనా అత్యవసం అయితే తనను సంప్రదించాలంటూ తన ఫోన్ నంబర్ ను కూడా ఇచ్చారు.

Update: 2020-03-30 13:14 GMT

ఒక నియోజక వర్గాన్ని పాలించే ఓ ఎమ్మెల్యే నిండుగర్భిణీకి వైద్యం అందించారు. ఏదైనా అత్యవసం అయితే తనను సంప్రదించాలంటూ తన ఫోన్ నంబర్ ను కూడా ఇచ్చారు. రాష్ట్రంలో తెలంగాణలో కరోనా వైరస్ ను నియంత్రించేందుకుగాను ప్రభుత్వం లాక్ డౌన్ ను అమలు చేసింది. దీంతో రాష్ట్రమంతా నిర్మాణుష్యంగా మారిపోయింది. ఈ క్రమంలో కొందరికి వైద్యపరమైన ఇతర అత్యవసర సేవలు అనివార్యమవుతున్నాయి.దీంతో ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలను తీసుకుంటుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు కలిగినా వెంటనే 100కు ఫోన్ చేసి సహాయం పొంద వచ్చని సూచించారు. దీంతో చాలామంది ప్రజలు ప్రభుత్వ సూచనలను పాటిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే వికారాబాద్‌ జిల్లా మోమీన్‌పేట మండలంలోని టేకులపల్లి గ్రామాంలో సు చెందిన సుధారాణి అనే గృహిని భర్త నవరత్నం హెల్పలైన్ ను ఆశ్రయించాడు. తన భార్య సుధారాణి 9 నెలల నిండు గర్భిణి కావడంతో ఆమెకు అత్యవసరంగా ఆమెకు వైద్యం అవసరమయింది. దీంతో ఆమె భర్త వెంటనే హెల్ప్ లైన్ కి ఫోన్‌ చేశాడు. వెంటనే అత్యవసర సేవా విభాగం స్పందించి వైద్య సాయం అందించడానికి ఏర్పాట్లు చేసారు. వైద్య సిబ్బంది సుధారాణి ఇంటికి చేరుకోవడానికి ముందే స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌‌కు ఈ విషయం తెలిసింది.

ఇక ఎమ్మెల్యే వృత్తి రీత్యా డాక్టర్‌ కావడంతో ఆయన వెంటనే సుధారాణి ఇంటికి చేరుకున్నారు. ఆమెకు పరీక్షలు నిర్వహించి, గర్భినికి రక్తం తక్కువగా ఉందని, పౌష్టికాహారం బాగా పెట్టాలని తెలిపారు. ఆమెకు కాన్పు కావడానికి ఇంకా సమయం ఉందని, మధ్యలో ఎప్పుడైనా నొప్పులు వస్తే తనను సంప్రదించాలని తెలిపారు. ఎమ్మెల్యే వెంట గ్రామ సర్పంచి నవనీత విష్ణువర్థన్‌ రెడ్డి, నరసింహ రెడ్డి ఉన్నారు.

Tags:    

Similar News