Vijaya Shanthi: తెలంగాణ వ్యతిరేకులు అక్కడ ఉండటంతో అసౌకర్యంగా ఫీల్ అయ్యా.. అందుకే మధ్యలో నుంచే వెళ్లిపోవాల్సి వచ్చింది..
Vijaya Shanthi: తెలంగాణ బీజేపీ చీఫ్‌గా కిషన్‌రెడ్డి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం జరుగుతుండగా.. మధ్యలో నుంచి వెళ్లిపోవడంపై మాజీ ఎంపీ విజయశాంతి క్లారిటీ ఇచ్చారు.
Vijaya Shanthi: తెలంగాణ వ్యతిరేకులు అక్కడ ఉండటంతో అసౌకర్యంగా ఫీల్ అయ్యా.. అందుకే మధ్యలో నుంచే వెళ్లిపోవాల్సి వచ్చింది..
Vijaya Shanthi: తెలంగాణ బీజేపీ చీఫ్‌గా కిషన్‌రెడ్డి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం జరుగుతుండగా.. మధ్యలో నుంచి వెళ్లిపోవడంపై మాజీ ఎంపీ విజయశాంతి క్లారిటీ ఇచ్చారు. ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టిన ఆమె.. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై పరోక్ష విమర్శలు చేశారు. నాడు తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించినవారు వేదికపై ఉన్నారని, తెలంగాణ వాదాన్ని ఉక్కుపాదంతో అట్టడుగుకు అణిచివేయాలని ప్రయత్నించినవారు ఉన్నచోట తాను ఉండటం అసౌకర్యం, అసాధ్యమంటూ పోస్ట్ పెట్టారు విజయశాంతి.
తెలంగాణ వ్యతిరేకులు అక్కడ ఉండటంతో అసౌకర్యంగా ఫీల్ అయ్యానని, అక్కడ చివరివరకు ఉండటం అసాధ్యమన్న విజయశాంతి.. అందుకే కార్యక్రమం మధ్యలోనుంచే వెళ్లిపోవాల్సి వచ్చిందని ఫేస్‌బుక్‌లో పోస్ట్ ద్వారా వివరణ ఇచ్చారు. అయితే.. తాను కిషన్‌రెడ్డిని అభినందించి, శుభాశీస్సులు తెలియజేసిన తరువాతే అక్కడి నుంచి వచ్చానన్నారు.