Vanasthalipuram: అగ్నిప్రమాదం కాదు...ఆత్మహత్యే

Vanasthalipuram: వనస్థలిపురం ఎఫ్‌సీఐ కాలనీలో టీచర్ మృతి ప్రమాదవశాత్తు కాదని, ఆత్మహత్యే అని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ

Update: 2021-05-26 05:51 GMT

వనస్థలిపురం అగ్ని ప్రమాదంలో మృతిచెందిన మహిళా (ఫైల్ ఇమేజ్)

Vanasthalipuram: వనస్థలిపురం ఎఫ్‌సీఐ కాలనీలో అగ్నిప్రమాదంలో మహిళా టీచర్ మృతి ప్రమాదవశాత్తు కాదని, ఆత్మహత్యే అని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే... రెండు రోజుల కిందట హైదరాబాద్‌లోని వనస్థలిపురం ఎఫ్‌సీఐ కాలనీలో అగ్నిప్రమాదం చోటచేసుకుని ఓ ప్రభుత్వ ఉద్యోగిని సజీవదహనమైన విషయం తెలిసిందే. అయితే, ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని, బాధితురాలు ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఘటన జరిగిన సమయంలో భార్యాభర్తలు గదిలో ఉండటంతో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మాట్లాడలేని స్థితిలో ఉన్నారు.

తొలుత ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని భావించినా.. అందులో నిజం లేదని ఫైర్ సిబ్బంది తేల్చారు. ఉపాధ్యాయురాలు సరస్వతి బలవన్మరణానికి పాల్పడినట్టు నిర్ధారించారు. భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా ఆమె తనంతట తానే ఒంటికి నిప్పు అంటించుకున్నారు. మంటలను ఆర్పేందుకు భర్త బాలకృష్ణ ప్రయత్నించడంతో ఆయన గాయాలపాలయ్యారు.

ఒక్కసారిగ మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బందికి స్థానికులు సమాచారం ఇచ్చారు. ఆమె మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించడంతో వాస్తవం బయటపడింది. నిప్పు అంటిచుకోడంతోనే సరస్వతి మృతి చెందినట్టు వైద్యులు తేల్చారు.

Tags:    

Similar News